నేటి నుంచి అమలులోకి టీఎస్ బీపాస్

by  |
నేటి నుంచి అమలులోకి టీఎస్ బీపాస్
X

దిశ, వెబ్‎డెస్క్: పట్టణ ప్రాంతాల్లో భవన నిర్మాణ అనుమతులు సులభతరం చేసేందుకు ప్రభుత్వం కొత్తగా రూపొందించిన టీఎస్‎బీపాస్ నేటి నుంచి అమలులోకి రానుంది. ఎంసీహెచ్ఆర్‎డీలో ఇవాళ ఉదయం మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. టీఎస్‎బీపాస్ వెబ్‎సైట్ తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూలో అందుబాటులో ఉంటుంది.

దరఖాస్తుదారు స్వీయ ధృవీకరణతో భవన నిర్మాణానికి అనుమతి ఇస్తారు. నిర్ణీత గడువులోగా అనుమతులు, ధ్రువపత్రాలను జారీచేయనున్నారు. 75 గజాల స్థలంలో నిర్మించుకునే భవనాలకు ఎలాంటి అనుమతులు అవసరం ఉండదు. 600 గజాల లోపు ఇళ్లకు.. 100 మీటర్ల కంటే తక్కువ ఎత్తుండే గృహాలకు స్వీయధ్రువీకరణ ద్వారా దరఖాస్తు చేసుకుంటే 21 రోజుల్లో అనుమతులు జారీ చేస్తారు.

Next Story