సృష్టికి ప్రతిసృష్టి ఫొటోగ్రఫి

by  |
సృష్టికి ప్రతిసృష్టి ఫొటోగ్రఫి
X

దిశ, కరీంనగర్: సృష్టికి ప్రతి సృష్టి ఫొటోగ్రఫి కళ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. కరీంనగర్‌లో ఫొటో గ్రఫీడే సందర్భంగా కెమెరా ఆర్ట్స్ క్లబ్ నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ… గతానికి ప్రతిరూపం ఛాయాచిత్రమనేనన్నారు. గత చరిత్ర ఆనవాళ్లను సజీవంగా ఉంచగలిగేది ఫోటోగ్రఫి మాత్రమేనని అన్నారు. ఈ సందర్భంగా మహిమల కేదార్ రెడ్డి, అనసూరి వేణు, కుమార్, కెమెరా ఆర్ట్స్ క్లబ్ ఫౌండర్ రాధాకృష్ణ, గుంటపల్లి స్వాములను ఘనంగా సత్కరించారు.


Next Story