నేరెడ్‌మెట్‌ డివిజన్ గులాబీదే..

by  |
నేరెడ్‌మెట్‌ డివిజన్ గులాబీదే..
X

దిశ, వెబ్‌డెస్క్ : నేరెడ్‌మెట్ డివిజన్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందారు. సమీప బీజేపీ అభ్యర్థిపై 782 ఓట్ల ఆధిక్యంతో టీఆర్ఎస్ అభ్యర్థి మీనా ఉపేందర్ రెడ్డి విజయం సాధించారు. దీంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపొందిన డివిజన్ల సంఖ్య 56కు చేరుకుంది. హైకోర్టు తీర్పు కారణంగా ఇప్పటివరకు ఈ డివిజన్‌లో ఓట్ల లెక్కింపు పెండింగ్‌లో పడింది. ఓట్ల లెక్కింపుకు లైన్ క్లియర్ కావడంతో తాజాగా లెక్కింపు పూర్తయిన తర్వాత టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందినట్లు పోలింగ్ అధికారులు ఖరారు చేశారు. బ్యాలట్ పేపర్లపై స్వస్తిక్ గుర్తు కాకుండా ఇంకే గుర్తు ఉన్నా దాన్ని ఓట్ల లెక్కింపు సందర్భంగా పరిగణనలోకి తీసుకోవద్దని, పక్కన పెట్టాలని, అలాంటివి ఎన్ని బ్యాలెట్ పేపర్లు ఉన్నాయో లెక్కించి వేరుగా ఉంచాలని హైకోర్టు గత వారం స్పష్టం చేసింది. ఆ ప్రకారం నేరెడ్‌మెట్‌లో టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్య ఉన్న తేడాకంటే వేరే గుర్తుతో ఉన్న బ్యాలట్ పేపర్ల సంఖ్యే ఎక్కువగా ఉండడంతో ఇంతకాలం ఓట్ల లెక్కింపు జరగలేదు.

టీఆర్ఎస్ అభ్యర్థికి 504 ఓట్లు ఎక్కువే ఉన్నాయి. కానీ పక్కకు పెట్టిన బ్యాలట్ పేపర్ల సంఖ్య మాత్రం 544 ఉంది. దీంతో హైకోర్టు నిర్ణయం తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తికావడంతో టీఆర్ఎస్ అభ్యర్థికి మొత్తం 782 ఓట్లు ఎక్కువగా ఉండడంతో గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

Next Story

Most Viewed