పార్లమెంట్‌లో TRS ఎంపీల ఆందోళన.. స్పీకర్ వెల్‌ లోకి దూసుకెళ్లిన ఎంపీలు

by  |
పార్లమెంట్‌లో TRS ఎంపీల ఆందోళన.. స్పీకర్ వెల్‌ లోకి దూసుకెళ్లిన ఎంపీలు
X

దిశ ప్రతినిధి, ఖమ్మం : కేంద్ర ప్రభుత్వ ఉద్దేశపూరిత అలసత్వంపై టీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు ఫైర్ అయ్యారు. మంగళవారం నామా నేతృత్వంలో టీఆర్ఎస్ ఎంపీలు లోక్‌సభలో రైతు సమస్యలపై చర్చకు పట్టుబట్టారు. కేంద్ర ప్రభుత్వ వైఖ‌రిని ఖండిస్తూ ఆందోళనకు దిగారు. తెలంగాణ రైతుల వరి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా స్పీక‌ర్ పోడియం ఎదుట‌ నిరసన తెలిపి నినాదాలతో హోరెత్తించారు. ధాన్యానికి కనీస మద్దతు ధర చట్టం చేయాలని, వ‌రిధాన్యం సేక‌ర‌ణ‌పై జాతీయ విధానం ప్రక‌టించాల‌ని ఎంపీలు నిలదీశారు. వరి కొనుగోళ్ల కోసం నిర్దిష్టమైన విధానాన్ని ప్రకటించాలని.. ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. సాగు చట్టాల రద్దుకు జరిగిన పోరాటంలో అమరులైన అన్నదాతలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని, వ‌రిధాన్యం సేక‌ర‌ణ‌పై జాతీయ విధానం ప్రక‌టించాల‌ని డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాల స‌మ‌యంలో వెల్‌లోకి దూసుకువెళ్లి నినాదాల‌తో హోరెత్తించారు. దీంతో స్పీక‌ర్ ఓం బిర్లా స‌భ‌ను మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు వాయిదా వేశారు.


Next Story

Most Viewed