నిర్మల్ డిపో ఆస్తులపై టీఆర్ఎస్ కన్ను

by  |
NIrmal bus
X

దిశ,తెలంగాణ బ్యూరో : నిర్మల్ బస్సు డిపో పరిధిలో బస్టాండ్‌కు సమీపంలో ఉన్న రెండున్నర ఎకరాల స్థలంపై టీఆర్ఎస్ కన్ను పడిందని టీఎస్ఆర్టీసీ ఎంప్లయిస్ యూనియన్ ఆరోపించింది. ఈ స్థలంలో గతనెల 16న స్థానిక మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి షాపింగ్ కాంప్లెక్స్ కోసం శిలాఫలకాన్ని వేశారని, ఈ స్థలాన్ని లీజుకు ఇవ్వడం లేదని ప్రభుత్వం ప్రకటించినా ఎలా వేస్తారని శుక్రవారం ప్రకటనలో ప్రశ్నించారు.

ఈ సందర్భంగా గతంలోనే ఇలాంటిది జరగితే పోరాటం చేసి మరి స్థలాన్ని లీజుకు ఇవ్వకుండా ఆపగలిగామని ఆర్టీసీ నాయకులు తెలిపారు. ప్రభుత్వం లీజుకు ఇవ్వమని తెలిపినా శిలాఫలకం వేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని, మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్‌ను బర్తరఫ్ చేయాలని యూనియన్ అధ్యక్షప్రధాన కార్యదర్శులు ఎస్.బాబు, కె.రాజిరెడ్డి డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఆస్తులను కాజేసేందుకు ప్రయత్నిస్తే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.



Next Story

Most Viewed