మేయర్‌తో నా ప్రాణానికి ముప్పు.. కేటీఆర్‌కు ఫిర్యాదు!

166
Mayor Vijayalakshmi

దిశ, క్రైమ్ బ్యూరో : గ్రేటర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి నుంచి తనకు ప్రాణహాని ఉందని టీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు సి.రామచందర్ ఆందోళన వ్యక్తం చేశారు. మేయర్ విజయలక్ష్మి తనను ఫోన్ చేసి బెదిరించారన్నారు. ఈ విషయమై మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్‌లోని రాఘవేంద్ర రియల్ ఎస్టేట్ సంస్థ నాలాను కబ్జా చేస్తోందన్నారు. ఈ విషయాన్ని ఆర్టీఐ కింద సమాచారం సేకరించి పత్రికలకు ఇచ్చానన్నారు.

దీంతో తనపై కక్ష పెంచుకున్న మేయర్.. ఇప్పుడే పోలీసులను నీ ఇంటికి పంపించి, అరెస్టు చేయించి, జైలుకు పంపిస్తానంటూ బెదిరించినట్టు తెలిపారు. తన ప్రాణాలకు హాని ఉందని, ప్రభుత్వం తగిన రక్షణ కల్పించాలన్నారు. బెదిరింపులకు పాల్పడిన మేయర్ విజయలక్ష్మిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించాలని మంత్రి కేటీఆర్‌ను కోరారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..