టీఆర్ఎస్ తొలి రెండు విజయాలు ఆ డివిజన్లే

113

దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తొలి‌రౌండ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మెహిదీపట్నంలో ఎంఐఎం అభ్యర్థి మాజీద్ హుస్సేన్ బోణి కొట్టగా పలుచోట్ల టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. యూసుఫ్​‌గూడలో రాజ్​‌కుమార్​ పటేల్​, మెట్టుగూడ‌లో దాసుని సునీత గెలుపొందారు. ప్రస్తుతం 55 స్థానాలకు పైగా డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులు లీడ్‌లో ఉండగా బీజేపీ 25 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అటు పాతబస్తీలోని 8స్థానాల్లో ఎంఐఎం లీడ్‌లో ఉండగా ఏఎస్‌రావునగర్‌, ఉప్పల్‌లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో దూసుకెళ్తోంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..