ఢిల్లీలో తెలంగాణ రాజకీయం.. ధాన్యం కొనుగోళ్లపై TRS, బీజేపీ నేతల వార్

by  |
BJP, TRS
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై రాతపూర్వకంగా స్పష్టతనివ్వాలని కేంద్రాన్ని కోరేందుకు గత రెండు రోజులుగా రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో మకాం వేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని, కేంద్ర మంత్రి పియూష్ గోయల్ అపాయింట్మెంట్ కోసం వేచిచూస్తుండగా.. మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు కేంద్ర మంత్రిని కలిసేందుకు అనుమతి లభించింది.

అయితే, రాష్ట్ర బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో గోయల్‌ను కలిసి ధాన్యం కొనుగోళ్లపై చర్చించనున్నట్లు సమాచారం. అంతేకాకుండా, రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై చర్చించనున్నారు. టీఆర్ఎస్ నాయకుల కంటే ముందే బీజేపీ నేతలతో మంత్రులు భేటీ కావడం హాట్ టాపిక్‌గా మారనుంది. కేంద్ర మంత్రిని కలిసే వారిలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీశ్ రెడ్డి, పువ్వాడ అజయ్, వేముల ప్రశాంత్ రెడ్డితోపాటు ఎంపీలు పాల్గొననున్నారు.



Next Story

Most Viewed