‘కమెడియన్‌ గోవిందకు మతి‌ చెడింది.. సైకియాట్రిస్ట్‌కు చూపించాలి’

41
bollywood comedian govinda

దిశ, సినిమా : బాలీవుడ్ సీనియర్‌ నటుడు, కమెడియన్‌ గోవింద సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్ ఎదుర్కొంటున్నాడు. గతేడాది ‘గోవింద రాయల్స్‌’ పేరిట యూట్యూబ్‌ చానల్‌ ప్రారంభించిన నటుడు.. ఇప్పటి వరకు రెండు పాటలు రిలీజ్‌ చేశాడు. ఇటీవలే మూడో మ్యూజిక్‌ వీడియో కూడా విడుదల చేయగా.. ‘హల్లో’ అంటూ సాగే పాటకు సింగర్, డైరెక్టర్ అతనే కావడం విశేషం. అయితే బాలీవుడ్ నటి నిషా శర్మతో కలిసి గోవింద ఈ పాటకు వేసిన స్టెప్పులు పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ క్రమంలోనే అతడి డ్యాన్స్‌పై స్పందిస్తున్న నెటిజన్లు.. ఇలాంటి పిచ్చిపిచ్చి కంటెంట్‌తో మా ప్రాణాలు తీయొద్దంటూ వేడుకుంటున్నారు. అంతేకాదు ‘గోవింద మంచి నటుడే.. కానీ ఈ మధ్య కాలంలో ఆయనకేదో అయ్యింది. సైకియాట్రిస్ట్‌కు చూపించండి’ అంటూ నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు.