అట్లయితే, బొమ్మ బ్లాక్ బస్టరే!

by  |
అట్లయితే, బొమ్మ బ్లాక్ బస్టరే!
X

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హీరోయిన్ల విషయంలో ఆచితూచి అడుగేస్తాడు. ఒక సినిమాకు ప్లస్ అయింది అనిపిస్తే, తర్వాతి సినిమాకు రిపీట్ చేసేందుకు ఏ మాత్రం ఆలోచించడం. ఒక వేళ స్క్రిప్ట్ చాలా డిమాండ్ చేస్తే తప్పా .. మరో హీరోయిన్ జోలికి పోడు. దర్శకుడిగా 11 సినిమాలు పూర్తి చేసిన త్రివిక్రమ్ హీరోయిన్లను ఎక్కువగా మార్చలేదు. అంతకు ముందు సినిమాలో తీసుకున్న హీరోయిన్లనే తర్వాతి సినిమాకు కూడా చూజ్ చేసుకున్నాడు. హీరోయిన్ క్రేజ్‌ను పరిగణనలోకి తీసుకుని ఏకంగా మూడు సినిమాల్లో కూడా వరుసగా ఆఫర్ ఇచ్చాడు.

జల్సా సినిమాలో హీరోయిన్‌గా యాక్ట్ చేసిన ఇలియానా ఆ సినిమాలో క్యూట్‌గా కనిపించడంతో అదే క్యూట్ నెస్‌ను జులాయి సినిమాలోను రిపీట్ చేశాడు. ఆ తర్వాత ఇలియానా అందకుండా బాలీవుడ్‌కు చెక్కేసింది. అందుకే, అత్తారింటికి దారేది సినిమాలో కొత్త హీరోయిన్‌ను ఎంచుకున్నాడు. హీరోయిన్ సమంత అత్తారింటికి దారేదిలో ఇన్నోసెంట్, క్యూట్‌నెస్‌తో ఆకట్టుకుంది. దీంతో తననే సన్నాఫ్ సత్యమూర్తి చిత్రానికి రిఫర్ చేసిన త్రివిక్రమ్ ‘అఆ’ సినిమాలో ఏకంగా లీడ్ రోల్ ఇచ్చాడు.

ఆ తర్వాత వచ్చిన అజ్ఞాతవాసి డిజాస్టర్ కాగా… ఎన్టీఆర్‌తో కలిసి కొత్త కాంబినేషన్‌కు తెరలేపిన త్రివిక్రమ్ ఇందులో కొత్త హీరోయిన్‌కు ఓటేశాడు. పూజా హెగ్డేను తారక్‌కు జోడిగా సెట్ చేసిన త్రివిక్రమ్ తర్వాత ‘అల వైకుంఠపురంలో’ సినిమాలోనూ అదే భామను హీరోతో జోడీ కట్టించాడు. ఇక ఇప్పుడు మళ్లీ తారక్‌తో సినిమా చేస్తున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చిన గురూజీ… మళ్లీ పూజానే కావాలంటున్నాడట. అంతేగా… కలిసొచ్చే హీరోలు ఉంటారో లేదో తెలియదు గానీ, త్రివిక్రమ్‌కు కలిసొచ్చే హీరోయిన్లు మాత్రం ఉన్నారు. అందుకే తన సూపర్ హిట్ సినిమాల్లో నుంచి ఏ హీరోయిన్‌ను రిపీట్ చేసినా బొమ్మ బ్లాక్ బస్టర్ అంతే.

Next Story

Most Viewed