హోంగార్డ్ కోటయ్యకు నివాళులు

by  |
హోంగార్డ్ కోటయ్యకు నివాళులు
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ 12వ బెటాలియన్ లో హోం గార్డుగా విధులు నిర్వహిస్తూ కాలేయ సంబంధిత వ్యాధితో మృతి చెందిన కోటయ్య మృతి పట్ల జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్, అదనపు ఎస్పీ నర్మద, డీటీసీ అదనపు ఎస్పీ సతీష్ చోడగిరి, పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు జయరాజ్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు.

సోమవారం మృతి చెందిన హోమ్ గార్డు భౌతికకాయానికి జిల్లా పోలీసు అధికారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు జయరాజ్, నాయకులు సోమయ్య, హోమ్ గార్డుల ఆర్.ఐ. భరత్ భూషణ్, హాలియా ఎస్.ఐ. శివకుమార్, సిబ్బంది తదితరులు అనుములలోని కోటయ్య గృహానికి వెళ్లి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కోటయ్య తామంతా కుటుంబానికి అండగా ఉంటామని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.


Next Story