- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డబ్బులు తిరిగివ్వాలంటూ యూట్యూబర్ వినయ్ కుయ్యా రౌడీయిజం.. వీడియో వైరల్
వినయ్ కుయ్యా అనే ఓ యూట్యూబర్ ఓ వ్యక్తిపై దాడి చేసి వివాదంలో చిక్కుకున్నాడు. అప్పు తీసుకున్న వ్యక్తి తిరిగి ఇవ్వకపోవడంతో తమ టీమ్ అతడిని ట్రాప్ చేసి పట్టుకున్నామని వీడియో చేశాడు.

దిశ, వెబ్ డెస్క్: ఈ మధ్య యూట్యూబర్లు రెచ్చిపోతున్నారు. కంటెంట్ క్రియేషన్ పేరుతో ఏది పడితే అది చేస్తున్నారు. ఇటీవల వేదాంత్ జాక్సన్ అనే యూట్యూబర్ తన ఛానల్‌లో చేసిన వీడియో వల్ల ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. తన చావుకు వేదాంత్ యూట్యూబ్ లో చేసిన వీడియోనే అంటూ బాధితురాలు ఆరోపించింది. దీంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు వినయ్ కుయ్యా అనే ఓ యూట్యూబర్ ఓ వ్యక్తిపై దాడి చేసి వివాదంలో చిక్కుకున్నాడు. అప్పు తీసుకున్న వ్యక్తి తిరిగి ఇవ్వకపోవడంతో తమ టీమ్ అతడిని ట్రాప్ చేసి పట్టుకున్నామని వీడియో చేశాడు. ఓ వ్యక్తికి 11 లక్షలు ఇవ్వాల్సి ఉండగా అవి తిరిగి ఇవ్వలేదని, ఫోన్ చేసినా ఎత్తడం లేదని చెప్పాడు. దీంతో తాము ఆ అప్పు తీసుకున్న వ్యక్తిని తమ టీంలోని ఓ అమ్మాయితో ట్రాప్ చేయించి పట్టుకున్నామని చెప్పాడు.
ఆ వ్యక్తిపై దాడి చేసిన వీడియోను సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే ఇదే వీడియోను ఓ లాయర్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఏమైపోతుంది.. అంటూ అధికారులను, సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. అయితే అప్పు తీసుకుని తిరిగి ఇవ్వకపోతే పోలీసులకు ఫిర్యాదు చేయాలి, లీగల్ గా డీల్ చేసుకోవాలి. కానీ వినయ్ కుయ్యా కొందరు వ్యక్తులతో కలిసి అప్పు తీసుకున్న వ్యక్తిపై దాడి చేయడంతో అతడు చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నట్టు అవుతుంది. కాబట్టి అతడిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే వినయ్ కుయ్యా దీన్ని కూడా కేవలం వ్యూవ్స్ కోసం ప్రాంక్ చేసి ఉంటాడని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు.






