ఆ మాల్‌లో పైసా కట్టకుండా మీకు నచ్చినవి తీసుకెళ్లొచ్చట!

by Disha Web |
ఆ మాల్‌లో పైసా కట్టకుండా మీకు నచ్చినవి తీసుకెళ్లొచ్చట!
X

దిశ, వెబ్ డెస్క్: షాపింగ్ మాల్స్‌కు వెళితే కచ్చితంగా పర్స్ కాలి అవడం పక్కా. షాపింగ్‌కు వెళ్లే ముందు వీటినే కొనాలని ప్లాన్ చేసుకుంటారు. కానీ, అక్కడికి వెళ్లాక నచ్చివన్నీ కొనేస్తుంటారు. అయితే ఓ మాల్‌లో ఒక్క పైసా చెల్లించకుండా మీకు నచ్చినవన్నీ తీసుకెళ్లొచ్చట. ఆశ్చర్యపోతాన్నారా? మీరు విన్నది నిజమే.

వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని రహీంనగర్‌లో ఉన్న 'అనోఖా మాల్‌'లో అన్నిటీ ఫ్రీగా తీసుకెల్లొచ్చు. ఈ మాల్‌లో పేదలకు అవసరమైన వస్తువులన్నీ ఉంటాయి. వీరికి అవసరమైనవి ఉచితంగా తీపుకెళ్లవచ్చు. దీనిని డాక్టర్ అహ్మద్ రజాఖాన్ అనే వ్యక్తి చలికాలంలో పేదలు, కార్మికులు ఇబ్బందిని గుర్తించి ఈ మాల్‌ను నిర్మించారట. ఇందులో పలువురు దాతలు అందించిన స్వెటర్లు, బ్లాంకెట్లు, దుప్పట్లు, చెప్పులు, సూట్‌కేసులు మొదలయినవన్నీ ఉంటాయట. ఇప్పుడు అనోఖా మాల్ పేదల పాలిట వరంగా మారినట్లు తెలుస్తోంది.


Next Story