తన భర్త జీతం చెప్పాలంటూ.. ఆర్‌టీఐకు మహిళ లేఖ..

by Dishafeatures2 |
తన భర్త జీతం చెప్పాలంటూ.. ఆర్‌టీఐకు మహిళ లేఖ..
X

దిశ, వెబ్‌డెస్క్: భార్య భర్తల మధ్య అనేక విషయాల్లో దాపరికాలు ఉంటుంటాయి. వాటిలో భర్త జీతం ప్రధానంగా ఉంటుంది. అయితే ఓ మహిళ చేసిన పనికి ఆర్‌టీఐ అధికారులంతా షాకయ్యారు. తన భర్త జీతం ఎంతో చెప్పాలంటూ ఓ మహిళ ఆర్‌టీఐకు అప్లై చేసుకుంది. తన భర్త తన జీతం గురించిన విషయాలను తనకు చెప్పడం లేదని, కాబట్టి ఆర్‌టీఐ తనకు ఈ వివరాలు తెలపాలని ఆ మహిళ కోరింది. దీనిపై స్పందించిన అధికారులు ఆ మహిళ భర్త స్థూల, నికర పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాల వివరాలను 15 రోజుల్లో ఆమెకు తెలపాలని ఈ సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (సీపీఐఓ)ను అప్లికేషన్ అందుకున్న సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ (సీఐసీ) ఆదేశించింది.

అయితే ఇదే విషయంపై ఆ మహిళ సీపీఐఓ, ఎఫ్ఏఏకు గతంలో కూడా అప్లికేషన్ దాఖలు చేసుకుంది. కానీ ఆ అప్లికేషన్లను ఆయాన డిపార్ట్‌మెంట్ కొట్టవేశాయి. అయితే ప్రస్తుతం ఈ విషయం నెట్టింట తెగ వైరల్ అవుతుండటంతో నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇకపై భర్తలు తమ జీతాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని, ఆర్టీఐ కూడా భర్తలపై కనికరం లేకుండా భార్యలకు వివరాలు ఇచ్చేస్తుందని నెటిజన్లు కామెంట్లు రాసుకొస్తున్నారు.


Next Story

Most Viewed