డాన్స్ చేస్తూ కుప్పకూలిన యువతి.. తర్వాత ఏమైందంటే?

by Jakkula Mamatha |
డాన్స్ చేస్తూ కుప్పకూలిన యువతి.. తర్వాత ఏమైందంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో హర్ట్ ఎటాక్‌తో చనిపోతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. చాలా మంది వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో మరణిస్తున్నారు. మారుతున్న ఆహార అలవాట్లు, వ్యాయామం సరిగా లేకపోవడమే గుండె సమస్యలకు కారణంగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ మధ్యకాలంలో చాలామంది వివాహ వేడుకలకు ఎలాంటి వెనకడుగు వేయకుండా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కొసారి అనుకోని సంఘటనలు వల్ల పెళ్లి కార్యక్రమంలో జరగాల్సిన శుభకార్యం కంటే అశుభ కార్యాలు కూడా జరుగుతున్నాయి.

అయితే తన సోదరి వివాహ వేడుకలో ఎంతో ఆనందంగా డాన్స్ చేస్తోన్న ఓ యువతి ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లో ఓ యువతి స్టేజీపై డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి మరణించారు. ఇండోర్‌కు చెందిన ఓ యువతి విదిషలో జరిగిన తన సోదరి పెళ్లి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆమె డాన్స్ చేస్తూ ఒక్కసారిగా ముందుకు పడిపోయారు. అక్కడే ఉన్న బంధువులు ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. అయితే ఆమె గుండెపోటుతో చనిపోయినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story

Most Viewed