Viral video: చిన్నప్పటి కాకి కథ నిజమైంది.. పుస్తకాల్లో నుంచి నిజ జీవితంలోకి!

by D.Reddy |
Viral video: చిన్నప్పటి కాకి కథ నిజమైంది.. పుస్తకాల్లో నుంచి నిజ జీవితంలోకి!
X

దిశ, వెబ్ డెస్క్: మనందరం చిన్నప్పుడు 'దాహంతో ఉన్న కాకి' లేదా 'Thirsty Crow' కథ గురించి పాఠ్య పుస్తకాల్లో చదువుకున్నాం. అందులో దాహంతో ఉన్న ఓ కాకి అడవంతా నీటి కోసం గాలిస్తుంది. అలా వెతుకుతుండగా ఓ చోట చిన్న కుండలో నీళ్లు కనిపించాయి. కానీ, కుండ అడుగున నీరు ఉండటంతో ఆ కాకి తాగలేకపోతుంది. దాంతో చాకచక్యంగా ఆలోచించిన ఆ కాకి.. ఒక్కో రాయి కుండలో వేస్తుంది. చివరికి రాళ్ల బరువుతో కుండలో నీరు పైకి వచ్చాయి. అప్పుడు హాయిగా నీరు తాగి కాకి తన దాహాన్ని తీర్చుకుంటుంది. ఇప్పుడీ స్టోరీ ఎందుకు చెబుతున్నానంటే.. పాఠ్య పుస్తకాల్లో ఉండే ఈ కాకి కథ నిజ జీవితంలో ఆవిష్కృతమైంది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

కథలో మాదిరిగానే దాహంతో ఉన్న ఓ కాకికి (Crow) బాటిల్‌లో నీళ్లు కనిపించాయి. అయితే, నీరు తాగేందుకు వీలుగా లేకపోవటంతో తన తెలివిని ప్రదర్శించింది. పక్కనే ఉన్న గులకరాళ్లను నోటితో తీసుకుని బాటిల్‌లో వేయటం ప్రారంభించింది. ఒకటి, రెండు రాళ్లను వేస్తూ తాగడానికి ప్రయత్నించినా దానికి నీరు అందదు. మళ్లీ తిరిగి కథలో చెప్పినట్లుగానే బాటిల్‌లో నీరు పైకి వచ్చే వరకు రాళ్లు వేసింది. చివరకు నీరు పైకి రావటంతో తన దాహం తీర్చుకుంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను వీడియో తీసి వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Next Story

Most Viewed