- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Viral video: రీల్స్ పిచ్చి.. గంగా నదిలో కొట్టుకుపోయిన యువతి

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. దీంతో నేటితరం యువత నెట్టింట ఎలాగైనా ఫేమస్ చేసుకోవాలని రకరకాల వీడియోలు చేస్తున్నారు. కొంతమంది అయితే ఈ రీల్స్ పిచ్చితో ప్రాణాలను సైతం పణంగా ప్రమాదాలను సైతం కొనితెచ్చుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో ఎన్నో చూశాం. తాజాగా ఇలాంటి మరో ఘటన వెలుగుచూసింది. రీల్స్ కోసం నదిలో దిగిన ఓ యువతి ప్రవాహంలో కొట్టుకుపోయింది. యూపీలోని (Uttarpradesh) వారణాసిలో (Varanasi) ఈ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్లితే..
కాశీలోని మణికర్ణిక ఘాట్ వద్ద ఓ యువతి గంగా నదిలోకి దిగి రీల్స్ చేసేందుకు ప్రయత్నించింది. అయితే నీటి ప్రవాహం అంచనా వేయకపోవడం, ఈత రాకపోవడంతో సదరు యువతి నది ప్రవాహంలో కొట్టుకుపోయింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఆమె కోసం గజ ఈతగాళ్లతో గాలిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. రీల్స్ కంటే ప్రాణాలు ముఖ్యమని, ఇలాంటి వెర్రివేషాలు వేయొద్దని సూచిస్తున్నారు.