Viral Video: నడిరోడ్డుపై భారీ సిక్సర్ బాదిన తాత.. వీడియో వైరల్

by Ramesh Goud |   ( Updated:2024-12-11 06:35:02.0  )
Viral Video: నడిరోడ్డుపై భారీ సిక్సర్ బాదిన తాత.. వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: నడిరోడ్డుపై నిలబడి ఓ తాత(Old Man) భారీ సిక్సర్(SiXer) బాదిన వీడియో సోషల్ మీడియా(Social Media)లో వైరల్(Viral) గా మారింది. వీడియో ప్రకారం ఓ తాత రోడ్డుపై వెళుతూ.. అకస్మాత్తుగా నిలబడి పోయాడు. తన లోకంలోకి వెళ్లిపోయి క్రికెట్(Cricket) ఆడటం మొదలు పెట్టాడు. తన వైపు బంతి వస్తున్నట్టుగా ఊహించుకొని, చేతిలో బ్యాట్ ఉన్నట్లుగా ఊహించి బౌన్సర్‌ బాల్ ను గాలిలోనే భారీ షాట్(Huge Shot) బాదాడు. లేని బంతిని సిక్సర్ గా మలిచిన ఆనందంలో లేని బ్యాటును ఊపుకుంటూ వెళ్లిపోయాడు. బంతి కూడా లేకుండా ఆ తాత సిక్సర్ బాదడం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు(Netizens) స్పందిస్తూ.. అలాంటి వారు చిన్నపిల్లల్లా తమ లోకంలో బ్రతికేస్తుంటారని, ఈ లోకంలో తాత ఉన్నంత ఆనందంగా అపర ఐశ్వర్యవంతులు కూడా ఉండలేరని పలు రకాల కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed