మేడ్ ఇన్ ఇండియా ఫోన్‌ను టెస్ట్ చేసిన కేంద్ర మంత్రి.. కింద పడేసి..

by Disha Web |
మేడ్ ఇన్ ఇండియా ఫోన్‌ను టెస్ట్ చేసిన కేంద్ర మంత్రి.. కింద పడేసి..
X

దిశ, వెబ్‌డెస్క్: దేశమంతా మేడ్ ఇన్ ఇండియాకు ప్రాధాన్యం ఇస్తుంది. ప్రజలతో పాటు ప్రముఖ సంస్థలు కూడా మేడ్ ఇన్ ఇండియాకు ప్రోత్సహిస్తున్నాయి. అందులో భాగంగా ఎలక్ట్రానిక్స్ రంగం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా మొబైల్ ఫోన్స్ సహా పలు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌ను తయారు చేసేందుకు పలు భారత సంస్థలు ముందుకు వస్తున్నాయి. తాజాగా స్వదేశంగా తయారైన ఓ మొబైల్‌ను కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ పరీక్షించారు. ఈ క్రమంలో ఆయన ఆ మొబైల్‌ను కింద పడేసి చెక్ చేశారు. అయితే తాజాగా డిజిటల్ టెక్నాలజీ ఫారమ్ ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) నిర్వహించిన కార్యక్రమానికి కేంద్ర మంత్రి హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే మేడ్ ఇన్ ఇండియా మొబైల్‌ను ఆయన పరీక్షించారు. ఆ మొబైల్ బలం చూసేందుకు ఆయన దాన్ని కింద పడేశారు. ఆ తర్వాత మొబైల్ దృఢత్వంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియో అశ్వినీ వైష్ణవ్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.

Next Story

Most Viewed