పొట్టు పొట్టు కొట్టుకున్న ఇద్దరు మహిళలు.. దేని కోసమో తెలుసా..? (వీడియో)

by Disha Web Desk 21 |
పొట్టు పొట్టు కొట్టుకున్న ఇద్దరు మహిళలు.. దేని కోసమో తెలుసా..? (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్య మహిళలు.. ఒకరిపై ఒకరు ఇష్టానుసారంగా కొట్టుకోవడం చూస్తున్నాం. రోడ్లు, వాహనాలు అనే కాకుండా.. ప్రజలు తరచూ తిరిగే ప్లేసుల్లోనూ అతి కౄరంగా ప్రవర్తిస్తున్నారు. ఇదివరకు ఇలాంటి వ్యవహారాలన్నీ రహస్యాంగానే ఉండేవి. కానీ, సోషల్ మీడియా పాపులర్ అయిన తర్వాత ఇలాంటి వీడియోలు తరచూ బయటకొస్తున్నాయి. విచిత్రం ఏంటంటే.. కళ్లముందు ఎంత ఘోరంగా బాదుకున్నా.. చుట్టు పక్కల వారు మాత్రం కనీసం ఫైటింగ్‌ను ఆపకుండా.. సినిమా చూసినట్టు చూస్తున్నారు. ఇక తాజాగా అలాంటిదే మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

రోడ్డుపై ఇద్దరు మహిళలు ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని డబ్ల్యూడబ్ల్యూఈ ఫైటింగ్‌ను తలపించేలా.. పిడుగుద్దులతో బాదుకున్నారు. ఎందుకు కొట్లాడుకున్నారో తెలియదు కానీ, ఫైటింగ్ మాత్రం ఘోరంగా చేసుకున్నారు. అయితే చుట్టూ జనం ఉన్నా ఒక్కరు కూడా వారి ఫైటింగ్‌ను ఆపలేదు. అంతేకాదు.. వారి ఫైటింగ్‌ను మొబైల్లో రికార్డ్ చేసి ఆనందంతో చూస్తున్నారు. ఇక అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది.


Next Story

Most Viewed