Trending: ట్విట్టర్‌లో ఏపీ మంత్రి సత్యకుమార్ మాస్ ర్యాగింగ్.. తట్టుకోలేక ఏకంగా బ్లాక్ చేసిన కేటీఆర్

by Shiva Kumar |
Trending: ట్విట్టర్‌లో ఏపీ మంత్రి సత్యకుమార్ మాస్ ర్యాగింగ్.. తట్టుకోలేక ఏకంగా బ్లాక్ చేసిన కేటీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: రెండు రాష్ట్రాల్లో పొలిటికల్ వారు రోజురోజుకు తారాస్థాయి చేరుతోంది. ఒకే రాష్ట్రానికి చెందిన నేతలు సవాళ్లుపై సవాళ్లు విసుకుంటున్న వేళ ట్విట్టర్‌లో ఆసక్తికర విషయం చోటుచేసుకుంది. మంగళవారం ఢిల్లీలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. పొరుగు రాష్ట్రంలోని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఓటిమిపై ఆయన స్పందించారు. నిత్యం ప్రజల్లో ఉండే కేతిరెడ్డి ఎలా ఓడిపోయాడో ఇప్పటికీ అర్థం కావడం లేదంటూ కేటీఆర్ ఆయను సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. అయితే, ఆయన కామెంట్స్‌పై ట్విట్టర్ (ఎక్స్)‌లో మంత్రి సత్యకుమార్‌ ఓ రేంజ్‌లో కౌంటర్ ఇవ్వగా ఆయనను కేటీఆర్ బ్లాక్ చేశారు.

ఈ సందర్భంగా సత్యకుమార్ ట్విట్టర్‌లో రెస్పాండ్ అవుతూ.. ‘ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ఓటమిపై తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ చిలక పలుకులు పలుకుతున్నారు. ధరణి పేరుతో తెలంగాణలో మీరు నడిపిన భూ మాఫియా లాగే, ధర్మవరంలో ‘గుడ్ మార్నింగ్’ పేరుతో మీ భూ బకాసుర మిత్రుడు ప్రభుత్వ, అసైన్డ్, ప్రైవేటు, ప్రజలు ఆస్తులను కూడా ఆక్రమించేశాడు. చివరికి చెరువులు, కొండలను కూడా కబళించేశాడు. గుడ్ మార్నింగ్ అంటే ప్రజలకు గుర్తుకొచ్చేది కబ్జా, కలెక్షన్, కరప్షన్, కమీషన్లే. మీ అవినీతిని ప్రశ్నిస్తూ నిర్మాణాత్మక విమర్శ చేసినందుకు నాలుగేళ్ల క్రితం ట్విట్టర్‌లో నన్ను బ్లాక్ చేశారు. ఈ అవినీతి, అహంకారం, అసమర్థతే మిమ్మల్ని.. మీ ప్రియ మిత్రులు జగన్, కేతిరెడ్డిలను ఓడించాయి. ఒకే జాతి పక్షులు ఒకరికొకరు సర్టిఫికేట్లు ఇచ్చుకుంటూ ఓదార్చుకోండి అంటూ సత్యకుమార్ ట్విట్టర్‌ వేదికగా మాస్ ర్యాగింగ్ చేశారు.

Next Story

Most Viewed