ఈ విద్యార్థి సంస్కారానికి సెల్యూట్ చేసిన తప్పు లేదు !

by Prasanna |
ఈ  విద్యార్థి సంస్కారానికి  సెల్యూట్ చేసిన తప్పు లేదు !
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రతి ఒక్క తల్లిదండ్రులు వారి పిల్లలను బాగా చదివించి.. వారికి మంచి భవిష్యత్ ఏర్పరచాలని కోరుకుంటారు. వారి పిల్లలను పెద్ద పెద్ద స్కూల్స్ లో చదివించాలనుకుంటారు. పిల్లలకు చిన్నప్పటి నుంచే విలువలను తెలియజేయాలి. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే వారికి కొంత సమయాన్ని కేటాయించి నాలుగు మంచి మాటలు చెబుతూ ఉండండి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక స్టూడెంట్ చేసిన పని చూసి అందరు షాక్ అవుతున్నారు.

ఒక స్టూడెంట్ స్కూల్లో పాఠాలు చెప్పే టీచరమ్మకు పాదాలకు పూలను పెట్టి..అనంతరం దండం పెట్టాడు. ఆ టీచరమ్మ స్టూడెంటును దీవించింది. గురువును పూజించే ఏ విద్యార్థి అయిన ఉన్నత స్థాయికి వెళ్తాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజెన్స్ స్టూడెంట్ అంటే ఇలా ఉండాలి, మా రోజుల్లో ఇలా గురువులను పూజించే వారు ఒక్కరు కూడా లేరు .. నువ్వు గ్రేట్ అంటూ ఈ విధంగా కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. అందులో స్కూల్ స్టూడెంట్ చేసిన పనికి అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Next Story

Most Viewed