ఆ స్వామిజీ స్టైలే వేరు.. ఏకంగా ఫ్యాన్‌నే హెల్మెట్‌గా మార్చి

by Dishanational2 |
ఆ స్వామిజీ స్టైలే వేరు.. ఏకంగా ఫ్యాన్‌నే హెల్మెట్‌గా మార్చి
X

దిశ, వెబ్‌డెస్క్ : సోషల్ మీడియా వచ్చాక వింతలు వినోదాలకు కొదవే లేకుండా పోయింది. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా సరే, వెంటనే మన ముందుకు వచ్చేస్తుంది. ఇక ఫన్నీ వీడియోస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే తాజాగా ఓ స్వామిజీకి చెందిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఏకంగా ఫ్యాన్‌నే హెల్మెట్‌గా చేసుకున్న అతని ఆలోచనకు అందరూ ఫిదా అవుతున్నారు.

వివరాల్లోకి వెళ్లితే.. ఉత్తర్ ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరికి చెందిన లల్లూరాం స్వామిజీ(77) పూల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇక రోజూ అదే పని చేసుకుంటూ ఉండే ఆయనకు ఎండకు ఎక్కువ సేపు సైకిల్ తొక్కడం ఇబ్బందిగా ఉడటంతో.. ఏం చేయాలో ఆలోచిస్తున్న క్రమంలో ఆయనకు ఓ గొప్ప ఆలోచన తట్టింది. ఓ కొత్త ప్లాస్టిక్ హెల్మెట్‌తో సోలార్ ఫ్యాన్‌ని తయారు చేశాడు. అది ఎలా అంటే ?

కొత్త ప్లాస్టిక్ హెల్మెట్ తీసుకున్నాడు. దానికి చిన్న టేబుల్‌ ఫ్యాన్‌ ని అమర్చాడు. సోలార్ సాయంతో ఆ ఫ్యాన్‌ నడిచేలా ఏర్పాట్లు చేశాడు. అది పెట్టుకుని ఊరంత తిరుగుతున్నాడు. దీంతో అతన్ని చూసిన వారందరూ షాక్ అవుతున్నారు. ఆ వ్యక్తి ఇంత పెద్ద ఐడియా ఎలా వచ్చిందంటూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతుంది.

ఇవి కూడా చ‌ద‌వండి

ఇండియాలో మొబైల్ గేమింగ్‌‌కు ఊపు.. ఇన్వెస్ట్‌మెంట్ పెంచిన కంపెనీలు




Next Story