భార్య అలిగిందని ఎస్పీకి లీవ్ లెటర్ రాసిన ఇన్‌స్పెక్టర్

by Hamsa |
భార్య అలిగిందని ఎస్పీకి లీవ్ లెటర్ రాసిన ఇన్‌స్పెక్టర్
X

దిశ, వెబ్‌డెస్క్: యూపీలోని ఫరూఖాబాద్‌లో ఓ పోలీస్ ఇన్‌స్పెక్టర్ తన భార్య కోసం ఓ వినూత్న ప్రయత్నం చేశాడు. సెలవు కావాలంటూ ఎస్పీకి లెటర్ రాశాడు. అందులో ఏముందో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ‘‘గత 22 ఏళ్లుగా హోలీకి పుట్టింటికి తీసుకెళ్లమని నా భార్య అడుగుతుంది. ఈ సారి ఎలాగైనా తీసుకెళ్లాల్సిందేనని అలిగింది. అందుకు నాకు 10 రోజులు సెలవులు కావాలి’’ అంటూ రాసుకొచ్చాడు. అది చూసిన ఎస్పీ అశోక్ కుమార్ నవ్వి ఇన్‌స్పెక్టర్‌కు 5 రోజులు సెలవు మంజూరు చేశాడు. ఇన్‌స్పెక్టర్ రాసిన లీవ్ లెటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read..

దాదాపు 100 సంవత్సరాల క్రితం నాటి క్యాడ్‌బరీ డైరీ మిల్క్

Next Story

Most Viewed