Viral News:విడాకులు ఇచ్చిన భార్య.. కోపంతో భర్త ఏం చేశాడో తెలిస్తే షాక్?

by Jakkula Mamatha |
Viral News:విడాకులు ఇచ్చిన భార్య.. కోపంతో భర్త ఏం చేశాడో తెలిస్తే షాక్?
X

దిశ,వెబ్‌డెస్క్: ఇటీవల సోషల్‌ మీడియా(Social Media)లో చిత్రవిచిత్ర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇక పెళ్లికి సంబంధించిన వీడియో(video)ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పీటల వరకు వచ్చిన పెళ్లిళ్లు కూడా ఆగిపోయిన ఘటనలు ఉన్నాయి. చిన్న చిన్న సంఘటనలతో పెళ్లి(Married) నిలిపివేసిన ఘటనలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరలవ్వడం చూస్తూనే ఉన్నాం. ఇదిలా ఉంటే.. ప్రస్తుత కాలంలో వివాహ బంధంలో అడుగుపెట్టిన తర్వాత ఇద్దరి అభిరుచులు కలవకపోవడమో లేదా కుటుంబ కలహాలతోనే కానీ విడాకులు తీసుకుంటున్న ఘటనలు పెరిగిపోతున్నాయి.

ఈ నేపథ్యంలో తాజాగా బీహార్‌(Bihar)లోని పాట్నా(Patna)లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఓ జంట విడాకులు(divorce) తీసుకుంది. కానీ భర్త(Husband)కు విడాకులు ఇవ్వడం ఇష్టం లేదు కావచ్చు విడాకులు ఇచ్చిన భార్య(Wife) పై పగ తీర్చుకోవడానికి సిద్ధమయ్యాడు. తనకు విడాకులు ఇచ్చిందని కోపంతో ఓ వ్యక్తి తన భార్య పై వినూత్నంగా పగ తీర్చుకున్నారు. తన భార్య తండ్రి బహుమతిగా ఇచ్చిన బైక్‌తో(Bike) అనేక సార్లు ట్రాఫిక్ రూల్స్‌ను బ్రేక్ చేశాడు. ఆ బైక్ రిజిస్ట్రేషన్ తన భార్య పేరు మీద ఉండడంతో ట్రాఫిక్ చలాన్లు(Traffic challans) ఆమెకు వెళ్లేవి. ఇలా ఆమెను ఇబ్బందులకు గురిచేశారు.

Advertisement
Next Story