- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఆరోగ్యం
- ఫోటోలు
అన్నయ్య పెళ్లికి యూకే నుంచి ఇండియాకొచ్చి సర్‌ప్రైజ్ ఇచ్చిన చెల్లి

దిశ, వెబ్ డెస్క్ : మన దేశం నుంచి విదేశాలకు వెళ్లడం ఈ రోజుల్లో చాలా కామన్ ఐపోయింది. ఉపాధి , విద్య కోసం ఇలా చాలా మంది విదేశాలకు వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళాక .. మళ్లీ రావాలంటే ఏదైనా శుభకార్యాలు ఉంటేనే వీలు చూసుకొని ఇంటికి వెళ్తుంటారు. అది కూడా టికెట్ రెండు.. మూడు నెలల ముందు బుక్ చేసుకొని ప్లాన్ చేసుకుంటారు. ప్రస్తుతం మన దేశంలో అయితే వారి ఇంట్లో జరిగే శుభకార్యానికి కూడా వచ్చే పరిస్థితి ఉండటం లేదు. ఈ అమ్మాయి పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇండియాలో ఉన్న అన్న పెళ్లికి హాజరు కాలేకపోతున్నా అంటూ బాధను పంచుకుంటూ పోస్ట్ చేసింది. కానీ ఆమె చేసిన పనికి ఆ కుటుంబమంతా సంతోషంలో మునిగిపోయారు. అనుకోకుండా ఆమెకి ఫ్లైట్ బుక్ అయ్యింది. ఇంట్లో వాళ్లకి చెప్పకుండా ఇంటికి వచ్చి అందరికి సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఆమె సరాసరి పెళ్లి మండపం దగ్గరికి వచ్చి అందరికి షాక్ ఇచ్చింది. ఆమెను చూడగానే కుటుంబ సభ్యులు ఆనందానికి అవధులు లేవు. ఆమె తల్లి సంతోషంతో ఏడ్చేసింది. ఇక ఆమె అన్నయ్య అయితే చెల్లిని చాలా కాలం తర్వాత చూడగానే ఆనందంతో పరవశించిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.