Breaking: ట్విట్టర్ లో దూసుకుపోతున్న సీఎం జగన్..గ్రాఫ్ మాములుగా లేదుగా

by Indraja |
Breaking: ట్విట్టర్ లో దూసుకుపోతున్న సీఎం జగన్..గ్రాఫ్ మాములుగా లేదుగా
X

దిశ డైనమిక్ బ్యూరో: వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో విపరీతమైన క్రేజ్ ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రజల్లో ముఖ్యంగా యువత మనసుల్లో సుస్థిర స్థానాన్ని జగన్ ఏర్పరుచుకున్నారు అనడానికి ఈ ఘటనే సాక్ష్యం. వివరాల్లోకి వెళ్తే.. ఈ రోజు అనంతపురం జిల్లా లోని రాప్తాడులో నిర్వహిస్తున్న సిద్ధం భహిరంగ సభలో జగన్ పాల్గొన్నారు.

అయితే రాప్తాడులో జరగనున్న సిద్ధం సభకు సీఎం జగన్ సిద్ధమయ్యారు అనే వార్త అధికారికంగా వచ్చినప్పటి నుండి జగన్ అభిమానుల ఆనందానికి పట్టపగ్గాలు లేవు. సోషల్ మీడియా వేదికగా వైసీపీ అభిమానులు రెచ్చిపోయారు. ఎప్పటికప్పుడు సిద్ధం అప్‌డేట్స్‌ను షేర్ చేయడంలో మునిగిపోయారు. దీనితో సొసైల్ మీడియాలోనే ‘సిద్ధం’ కార్యక్రమం ట్రెండింగ్‌లో నిలిచింది.

వైసీపీ అభిమానులు సోషల్ మీడియా వేదికల్లో దేన్ని విడిచిపెట్టడం లేదు. ముఖ్యంగా ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ ‘సిద్ధం’ సభా ప్రాంగణం ఫొటోలతో నిండిపోయింది. ఇక ఈ నేపధ్యంలో ట్విట్టర్‌ (X)లో దేశంలోనే తొలి స్థానంలో ‘సిద్ధం’ హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతోంది.

Advertisement

Next Story