పూట గడవడం కోసం తోపుడు బండి.. అదే చేత్తో కలం పట్టి (వీడియో)

by Disha Web Desk 4 |
పూట గడవడం కోసం తోపుడు బండి.. అదే చేత్తో కలం పట్టి (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: చదువు ఉంటేనే ఉన్నత శిఖరాలకు ఎదగగలం. అయితే ఇప్పుడు ఉన్నత స్థానాల్లో ఉన్న చాలా మంది ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లు, ఇంజినీర్లుగా ఎదిగిన వారే. ఉన్నత స్థాయిలో ఉన్న చాలా మంది తాము పడ్డ కష్టాలను ఆయా సందర్భాల్లో ఇతరులకు చెబుతారు. వారి విజయగాధలు కొంత మందిలో స్ఫూర్తిని నింపడంతో పాటు నిర్ధేశించుకున్న లక్ష్యం వైపు ముందుకు సాగేలా బూస్ట్ ఇస్తాయి.

అయితే హైదరాబాద్‌లో కనిపించిన దృశ్యం మాత్రం కష్టాలు చదువుకు ఆంటకం కాదని నిరూపించాయి. తోపుడు బండితో జీవనం సాగిస్తున్న ఓ బాలుడు బండి దగ్గరే కూర్చొని రాసుకుంటున్నాడు. ఇది చూసిన ఓ నెటిజన్ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూటగడవడం కోసం పోరాటం ఓ వైపు.. భవిష్యత్తు కోసం మరోవైపు ఆ బాలుడు సాగిస్తున్న స్ఫూర్తిదాయక ప్రయాణానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.


Next Story

Most Viewed