యూకేలో సందడి చేస్తున్న పింక్ పావురం.. నెట్టింట్లో ఫొటోలు వైరల్

by Disha Web Desk 1 |
యూకేలో సందడి చేస్తున్న పింక్ పావురం.. నెట్టింట్లో ఫొటోలు వైరల్
X

దిశ, వెబ్ డెస్క్ : మనం సాధారణంగా పావురాలను చూస్తాం.. అవి దాదాపు నలుపు, తెలుపు లేదా బుడిద రంగులో ఉంటాయి. కానీ, పింక్ కలర్ లో ఉన్న పావురాన్ని ఎప్పుడైనా చూశారా.. అవును, మీరు చదివింది నిజమే..! యూకేలోని గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు తమ పెట్రోలింగ్ లో భాగంగా పింక్ పావురాన్ని చూశారు. అయితే, అందుకు సంబంధించిన ఫొటోను హ్యరియట్ హేవుడ్ టీవీ న్యూస్ ప్రెసెంటర్ తన 'X' (గతంలో ట్విట్టర్) ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, గులాబీ రంగు పావురం గతంలో న్యూయార్క్ నగరంలోని మాడిసన్ స్క్వేర్ పార్క్‌ కనిపించిందని హ్యరియట్ పెట్టిన పోస్ట్ కు ఓ నెటిజన్ రిప్లై ఇచ్చాడు.


Next Story

Most Viewed