Patanjali: పంతంజలి ప్రొడక్ట్స్ వాడే వారికి బ్యాడ్ న్యూస్.. మార్కెట్లో ఆ 14 రకాల వస్తువులపై బ్యాన్

by Shiva Kumar |
Patanjali: పంతంజలి ప్రొడక్ట్స్ వాడే వారికి బ్యాడ్ న్యూస్.. మార్కెట్లో ఆ 14 రకాల వస్తువులపై బ్యాన్
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్పత్తులపై తప్పుడు ప్రకటనలు చేసినందుకు గాను పతంజలిపై సుప్రీంకోర్టు పూర్తిగా నిషేధం విధించింది. కోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తూ.. మళ్లీ ఆ సంస్థ యాడ్స్ చేయడం పట్ల కోర్టు మండిపడింది. ఈ మేరకు పతంజలి అధినేత బాబా రామ్‌దేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణకు నోటీసులు జారీ చేసింది. సంస్థపై కోర్టు ధిక్కార పిటిషన్‌ నమోదైనా సమాధానం ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో పంతజలి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మొత్తం 14 రకాల ఉత్పత్తులను మార్కెట్లో విక్రయించడం నలిపివేస్తున్నట్లు పతంజలి సంస్థ ప్రకటించింది. అందుకు సంబంధించి వివరాలను సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అదేవిధంగా దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం 5,606 ఫ్రాంచైజీ స్టోర్లకు ఇప్పటికే సూచనలు జారీ చేసింది. పతంజలి రద్దు చేసిన 14 రకాల ఉత్పత్తుల్లో దృష్టి లివమ్రిత్ అడ్వాన్స్, స్వసరి గోల్డ్, ఐ డ్రాప్, స్వసరి వాటి, బ్రొన్‌కమ్, స్వసరి ప్రవాహి, స్వసరి అవాలెహ్, ముక్తా వాటి ఎక్స్‌ట్రా పవర్, లిపిడామ్, బీపీ గ్రిట్, మధుగ్రిట్, మధునషిని వాటి ఎక్స్‌ట్రా పవర్, లివొగ్రిట్, ఐగ్రిట్ గోల్డ్ ప్రొడక్ట్స ఉన్నాయి.



Next Story

Most Viewed