ఓలా స్కూటర్ లో మ్యూజిక్.. నెటిజన్లు ఫిదా చేస్తున్న నయా ఫీచర్

by Disha Web |
ఓలా స్కూటర్ లో మ్యూజిక్.. నెటిజన్లు ఫిదా చేస్తున్న నయా ఫీచర్
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం దేశం మొత్తం నవరాత్రి సంబరాల వేడుకలు వెన్నువంటుతున్నాయి. ఏ ప్రాంతంలో చూసినా డ్యాన్స్‌లతో హోరిత్తిస్తున్నారు. అయితే తాజాగా గుజరాత్‌లోని ఓ ప్రాంతంలో ప్రజలు నవరాత్రి వేడుకల్లో సందడి చేయాలనుకున్న క్రమంలో కరెంట్ పోయింది. దీంతో వేడుకలను కొనసాగించడానికి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఉపయోగించే తీరు అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఓలా ఎస్1 ప్రో స్కూటర్‌‌‌లో సాంగ్స్ వినపడే ఫీచర్స్ ఉండటంతో వారి సందడి, సంబరాలు కొనసాగాయి. ఈ వినూత్నమైన 'జుగాడ్' నెటిజన్లను ఆకట్టుకుంది. ఇక అందుకు సంబంధించిన వీడియోను శ్రేయాస్ సర్దేశాయ్ అనే వ్యక్తి ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు ఓలా ఈవీ స్కూటర్‌పై ప్రశంసలు కురిపిస్తు్న్నారు. ఇక ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ కూడా ఈ వీడియోపై రీట్వీట్ చేసి సంతోషం వ్యక్తం చేశారు.'మేము వచ్చే ఏడాదికి ముందు మూవ్ ఓఎస్‌తో ప్రత్యేక నవరాత్రి మోడ్‌ను నిర్మిస్తామని' చెప్పాడు.

Next Story

Most Viewed