Rave Party: ఉహు అంటే కుదరదు.. అన్నింటికీ ఊ అంటేనే ఎంట్రీ.. ఛీ..ఛీ రేవ్‌పార్టీ అంటే ఇదా..?

by Indraja |
Rave Party: ఉహు అంటే కుదరదు.. అన్నింటికీ ఊ అంటేనే ఎంట్రీ.. ఛీ..ఛీ రేవ్‌పార్టీ అంటే ఇదా..?
X

దిశ వెబ్ డెస్క్: రేవ్‌పార్టీలో పట్టుబడిన ప్రముఖ సినీ తారలు, రాజకీయ నేతలు అంటూ వస్తున్న వార్తలు మీడియాని, సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఈనేపథ్యంలో అసలు ఈ రేవ్‌పార్టీ అంటే ఎమిటి..? పార్టీ చేసుకుంటే పోలీసులు ఎందుకు రైడ్ చేస్తారు..? పార్టీలో దొరికిన వ్యక్తులు ఎందుకు భయపడతారు..? రేవ్‌పార్టీ ఎక్కడ మొదలైంది అనే ప్రశ్నలకు సామాధానం ఇప్పుడు తెలుసుకుందాం.

రేవ్‌పార్టీ అంటే ఏమిటి..? ఎక్కడ, ఎప్పుడు మొదలైంది..?

రేవ్‌ అంటే ఉత్సాహం అని అర్థం. కాగా రేవ్‌పార్టీ అనేది 1950లో ఇంగ్లాడ్, లండన్‌లో మొదలైంది. వైల్డ్ బోహేమియన్ పార్టీలను వర్ణి్ంచడానికి రేవ్‌ అనే పదాన్ని వాడే వారు. బోహేమియన్ పార్టీ అంటే, పార్టీకి వచ్చిన వాళ్లు ఉన్నవాళ్లా..? లేని వాళ్లా..? అని చూడకుండా, పార్టీకి వచ్చిన వాళ్లందరిని గౌరవించడం. వాళ్లకు ఘణంగా స్వాగతం పలకడం. అందరు కలిసి సరదాగా ముచ్చటించుకోవడం చేసేవారు.

అలానే ఈ రేవ్‌పార్టీ ల్లో సంగీత విధ్వాంసులు సంగీతాన్ని ఆలపించేవారు. కొందరు డాన్స్ చేసేవాళ్లు. అయితే సదుద్దేశంతో మొదలైన ఈ రేవ్‌పార్టీల్లో కాలక్రమేనా మార్పులు చోటు చేసుకున్నాయి.

కాలంతోపాటు రేవ్‌పార్టీలు ఎలా మారాయి..?

ఎలాంటి తారతమ్యాలు లేకుండా అందరు కలిసి సరదాగా గడపాలనే సద్దుద్దేశంతో మొదలైన రేవ్‌పార్టీలు, కాలక్రమేనా చీకటి గదికి, నిర్ణీత వ్యక్తులకు పరిమితమైయ్యాయి. మద్యం, హద్దులు లేని సృంగారం, నగ్నంగా డాన్స్‌లు, మాధకద్యవ్యాల మత్తులో రాత్రి మొత్తం గడపడమే ప్రస్తుంతం రేవ్ పార్టీల ఉద్దేశం.

భారత దేశంలో రేవ్‌పార్టీ తొలిసారి ఎక్కడ మొదలైంది..?

భారత దేశంలోని గోవాలో తొలిసారి రేవ్‌పార్టీని నిర్వహించారు. అక్కడ నుండి బెంగళూరు, హైదరాబాద్, ముంబాయి వంటి మహానగరాలకు రేవ్‌పార్టీలు వ్యాపించాయి. ఈ రేవ్‌పార్టీల్లో ఎక్కువగా సినీ తారలు, ప్రముఖులు పాల్గోంటారు.

రేవ్ పార్టీల్లో పాల్గొనే వాళ్లకు నిబంధనలు ఏంటి..?

రేవ్‌పార్టీలు ఓ ప్రనాళికాబద్దంగా నిర్వహిస్తారు. వందమందితో రేవ్‌పార్టీ అంటే.. ఆ పార్టీలో వందమంది మాత్రమే ఉంటారు. చివరిక్షణంలో జాయిన్ అవ్వాలి అని అనుకున్న జాయిన్ చేసుకోరు. అలానే పార్టీలో పాల్గొనే వాళ్లకు అక్కడ జరిగే షడ్యూల్ మొత్తం ముందుగానే చెప్తారు. దానికి ఓకే అని అంటేనే రేవ్ పార్టీలోకి ఎంట్రీ ఉంటుంది. ఇక నిబంధనలకు ఓకే అని పార్టీలో పాల్గొన్న తరువాత దేనికి నో చెప్పకూడదు. అలానే ఫోన్లు అలో చెయ్యరు. సీసీ కెమారా కూడ ఆఫ్‌‌లో ఉంటుంది.

రేవ్ పార్టీల్లో ఏం జరుగుతుంది..? ఎందుకు రేవ్ పార్టీల్లో దొరికినవాళ్లు మోఖాలు దాచుకుంటారు..?

రేవ్ పార్టీలు ఎప్పుడు కూడ నగర శివార్లో, జనసంచారం లేని ప్రదేశాల్లో ఉన్న ఫామ్ హౌసుల్లో ఎక్కువగా జరుగుతాయి. ఫామ్ హౌసులోని ఓ చీకటి రూమ్‌లో లేసర్ లైట్‌లో ఈ పార్టీ నిర్వహిస్తారు. తాగడం, డ్రగ్స్ తీసుకోవడం, విచ్చలవిడి శృంగారం, నగ్నంగా డాన్స్‌లు చేయడం, ఇదేరాత్రి మెత్తం జరుగుతుంది. అయితే ఇండియాలో డ్రగ్స్ తీసుకోవడం నేరం, కనుక చట్టవిరుద్ద కార్యకలాపాలు సాగించే రేవ్‌పార్టీలపై పోలీసులు రైడ్ చేస్తారు.

Next Story

Most Viewed