రూ.11 లక్షల కారుకు రూ.22 లక్షల రిపేర్.. ఎస్టిమేట్ బిల్ చూసి షాకైన వ్యక్తి..

by Dishafeatures2 |
రూ.11 లక్షల కారుకు రూ.22 లక్షల రిపేర్.. ఎస్టిమేట్ బిల్ చూసి షాకైన వ్యక్తి..
X

దిశ, వెబ్‌డెస్క్: తాజాగా ఓ కారు యజమానికి సర్వీస్ సెంబర్ వాళ్లు పెద్ద షాకిచ్చారు. రూ.11 లక్షల ఖరీదైన కారు రిపెయిర్‌కు రూ.22 లక్షల ఎస్టిమేషన్ బిల్ ఇచ్చారు. ఆ బిల్ చూసేసరికి ఆ యజమాని ఫ్యూజులు ఎగిరిపోయాయి. తన కారు ఖరీదు కన్నా రిపెయిర్ బిల్లు డబుల్ ఛార్జ్ అవుతుందని చూసి ఏం చేయాలో అర్థం కాక జుట్టు పీక్కున్నాడు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన రూ.11 లక్షల ఖరీదైన ఫోక్స్‌వ్యాగన్ కారును సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లాడు. అక్కడి అతడి కారు రిపెయిర్‌కు రూ.22 ఎస్టిమేషన్ బిల్లును ఇచ్చారు. ఈ విషయాన్ని సగటు వ్యక్తి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. అంతేకాకుండా అతడు తన కారును తిరిగి తీసుకునే ముందు ఆ సర్వీస్ సెంటర్ కారు ఇన్సూరెన్స్ పేపర్లకు రూ.44,840 ఛార్జ్ చేసిందని అతడు పేర్కొన్నారు.

దాంతో అతడు ఫోక్స్‌వ్యాగన్ ఇండియాను కాంటాక్ట్ చేయగా అందుకు కేవలం రూ.5 వేలు ఛార్జ్ చేస్తామని సంస్థ వారు తెలిపారని, ఎట్టకేలకు సెప్టెంబర్ 26 అతడు తన కారును తిరిగి తెచ్చుకున్నట్లు చెప్పుకొచ్చాడు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు దీనిపై వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. సర్వీస్ సెంటర్ వాడికి చేతివాటం చూపడంలో అనుభవం లేనట్లుంది అంటూ నెటిజన్లు ఆ సర్వీస్ సెంటర్‌పై జోకులు పేలుస్తున్నారు.


Next Story

Most Viewed