చిల్డ్ బీర్‌లో చచ్చిన బల్లి.. దిమ్మ తిరిగి దుకాణంపైకి వెళ్లిన కస్టమర్.. కట్ చేస్తే..

by karthikeya |
చిల్డ్ బీర్‌లో చచ్చిన బల్లి.. దిమ్మ తిరిగి దుకాణంపైకి వెళ్లిన కస్టమర్.. కట్ చేస్తే..
X

దిశ, వెబ్‌డెస్క్: కుర్రాళ్లకి బీర్ (Beer) అంటే ఎంత క్రేజో వేరే చెప్పక్కర్లేదు. ఏ చిన్న అకేషన్ అయినా సరే చేతిలో బీర్ బాటిల్ లేనిదే మజా రాదంటారు చాలామంది యూత్. కానీ బీర్ తాగడం, తాగుతూ ఎంజాయ్ చేయడం ఓకే కానీ.. బీర్ తాగే ముందు మాత్రం చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఎందుకంటే బాటిలో బీర్‌తో పాటు చచ్చిన బల్లి కూడా ఉండొచ్చు. ఏంటి షాకయ్యారా..? నిజమండీ బాబూ..! మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని బేతుల్‌లో సచిన్ (Sachin) అనే వ్యక్తికి ఇలాగే జరిగింది. షాపు నుంచి బీర్ బాటిల్‌ కొని ఇంటికెళ్ళి ఓపెన్ చేసి గ్లాసులో పోసుకోగానే అందులో చచ్చిన బల్లి కనిపించింది. దీంతో సచిన్ కోపంగా మద్యం దుకాణానికి వెళ్లి విషయం చెప్పి గ్లాసులో బల్లిని చూపించాడు. కానీ ఆ మాట వినగానే.. దుకాణదారుడు తనని దుర్భాషలాడాడని, షాపు నుంచి బయటకు తోసేశాడని సచిన్ ఆరోపించాడు. దీంతో సచిన్ కూడా కోపంగా దుకాణం ముందు వీరంగం సృష్టించాడు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేస్తానని చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియా (Social Media)లో వైరల్‌ అవుతోంది.

ఇక దీనిపై ఎక్సైజ్ అధికారి (Excise Officer) అన్షుమన్ చాదర్ మాట్లాడుతూ.. ఘటనకు సంబంధించి తనకు ఎలాంటి ఫిర్యాదూ అందలేదని చెప్పారు. అయితే తాను కూడా వీడియో చూశానని, బాటిల్ లోపల బల్లి ఎలా వచ్చిందో ఆరా తీస్తున్నామని, అజాగ్రత్తగా ఉన్నవారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story