నా ప్లేట్‌లో అన్ని దొరికాయ్..! వినూత్నంగా ఉగాది విషెస్ చెప్పిన ఐఏఎస్ స్మితా సబర్వాల్

by Shiva Kumar |
నా ప్లేట్‌లో అన్ని దొరికాయ్..! వినూత్నంగా ఉగాది విషెస్ చెప్పిన ఐఏఎస్ స్మితా సబర్వాల్
X

దిశ, వెబ్‌డెస్క్: స్మితా సబర్వాల్ యంగ్, డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్. నిజాయితీకి మారుపేరుగా తెలుగు రాష్ట్రాలకు పరిచయం అక్కర్లేని పేరు ఆమె సొంతం. గత ప్రభుత్వంలో సీఎంవోలో కీలక అధికారిగా బాధ్యతలు నిర్వర్తించిన ఆమెకు X (ట్విట్టర్‌)లో 4,20 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. రాష్ట్రంలో ఎలాంటి సేవా కార్యక్రమాలు జరిగినా.. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ ట్విట్టర్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్ వేదికగా ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ పోస్ట్ చేస్తూ.. తన ఫాలోవర్లతో నూతనోత్సాహాన్ని నింపుతారు. ఈ క్రమంలోనే ఉగాది పండు సందర్భంగా X (ట్విటర్)ఖాతాలో రాష్ట్ర ప్రజలకు వినూత్నంగా విషెస్ తెలిపారు. ‘నా ప్లేట్‌లో అన్నీ దొరికాయి! అన్ని రుచులతో జీవితాన్ని ఆస్వాదించాలనే చేదు, తీపి గుర్తుకు #ఉగాదిని ప్రేమించండి, శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు’ అంటూ ఉగాది పచ్చడి, మామిడాకులు, పూజ ద్రవ్యాలు ఉన్న ప్లేట్‌ పట్టుకున్న ఫొటోను పోస్ట్ చేశారు.Next Story

Most Viewed