ఖరీదైన గిఫ్ట్ కోసంప్రేమ నాటకం.. బహుమతి అందుకోగానే బ్రేకప్.. గర్ల్‌ఫ్రెండ్ మోసంపై యువకుడు న్యాయ పోరాటం!

by Prasad Jukanti |

బర్త్ డే గిఫ్ట్ గా ఖరీదైన బహుమతిని ఇస్తున్నానని తెలుసుకుని ప్రేమ నాటకమాడిన ఓ ప్రియురాలు గిప్ట్ తీసుకున్న మరుసటి రోజే తనను వదిలేసిందంటూ ఓ యువకుడు చేసిన పోస్ట్ వైరల్‍గా మారింది.

ఖరీదైన గిఫ్ట్ కోసంప్రేమ నాటకం.. బహుమతి అందుకోగానే బ్రేకప్.. గర్ల్‌ఫ్రెండ్ మోసంపై యువకుడు న్యాయ పోరాటం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రేమ, నమ్మకం ఒక బలమైన బంధానికి పునాది. నిజమైన ప్రేమలో భాగస్వామిపై విశ్వాసం పెంచుతాయి. కానీ ఇటీవల కాలంలో ప్రేమ పేరిట జరుగుతున్న మోసాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. ప్రేమను నటిస్తూ సర్వం కాజేస్తున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే ఇప్పుడు షాకింగ్ గా మారింది. ప్రేమ పేరుతో ఓ యువతి నటించి నన్న నిండా ముంచేసిందని ఓ యువకుడు ఆన్ లైన్ వేదికగా తన బాధను వ్యక్తం చేశాడు. రూ. 3 లక్షల ఖరీదైన గిఫ్ట్ కోసం తనతో ప్రేమను నటించి బహుమతి అందుకున్న మరుసటి రోజే నన్ను వేదిలేసిందంటూ లబోదిబోమంటున్నాడు. ఇది తనకు జరిగిన ఘోరో అవమానంతో పాటు ఆర్థిక నష్టం కలిగించిందని ఈ విషయంలో లీగల్ అడ్వైజ్ ఇవ్వగలరూ అంటూ ఓ వ్యక్తి రెడ్ ఇట్‍లో చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్‍గా మారింది.

ఇంతకీ ఏం జరిగిందంటే?:

యూకేకు చెందిన బాధితుడు తన తాను తన గర్ల్ ఫ్రెండ్ చేతిలో ఎలా మోసపోయానో వివరిస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్టు చేశాడు. మేమిద్దరం గత మూడేళ్లుగా రిలేషన్ షిప్‍లో ఉన్నామని అయితే తన ప్రియురాలు ఎప్పటి నుంచో అడుగుతోందని చెప్పి ఈ పుట్టిన రోజుకు దాదాపు రూ. 3.1 లక్షలు ఖర్చు చేసి మంచి గేమింగ్ పీసీని ఆమెకు బహుమతిగా ఇచ్చానని చెప్పాడు. కానీ విచిత్రంగా గిఫ్ట్ ను స్వీకరించిన మరుసటి రోజే ఆమె నాకు బ్రేక్ అప్ చెప్పేసిందని ఇంతలా నన్ను ఎవరూ వాడుకోలేదని ఇది తనకు చాలా బాధ క లిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు.

గిఫ్ట్ కోసమే బ్రేకప్ పోస్ట్ పోన్:

అయితే సదరు యువతి తనను వదిలేయాలని కొన్ని నెలల క్రితమే నిర్ణయించుకుందని కానీ ఈ ఖరీదైన బహుమతి కోసం ఇన్నాళ్లు నాటకమాడినట్లు ఆ యువకుడు రాసుకొచ్చాడు. ఈ విషయం ఆమె స్నేహితురాలి ద్వారా తనకు ఇప్పుడు తెలిసిందనన్నాడు. తనకు బ్రేకప్ చెప్పాలని కొన్ని నెలల క్రితమే నిర్ణయించుకున్నప్పటికీ ఎలాగూ నేను కంప్యూటర్ కొని ఇస్తానని గ్రహించి బర్త్ డే వరకు వెయిట్ చేసిందని దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లు (చాట్ హిస్టరీ) కూడా నేను సంపాదించానని పేర్కొన్నాడు.

లీగల్ గా ఆ పీసీ ఆమెకే!:

అయితే యూకే చట్టాల ప్రకారం ఒకసారి కానుకగా ఇచ్చిన వస్తువు పై పూర్తి హక్కులు ఆ బహుమతి స్వీకరించిన వారికే ఉంటాయి. ఈ చట్టం ప్రకారం ఆ పీసీ ఇప్పుడు ఆ యువతికే చెందుతుంది. అయితే ఆమె నన్ను మోసం చేయాలనే ఉద్దేశంతోనే తనతో రిలేషన్ షిప్ కొనసాగించిందని ఇది నిరూపించేందుకు అవసరమైన ఆధారాలు తన వద్ద ఉన్నాయనిబాధితుడు పేర్కొన్నారు. ఈ ఆధారాలతో నేను ఆ ఆమెకు ఇచ్చిన బహుమతిని వెనక్కి తీసుకునే అవకాశం ఏమైనా ఉందా? అని నెటిజన్లను న్యాయ సలహా కోరాడు. దీంతో స్పందిస్తున్న నెటిజన్లు లీగల్‌గా చూస్తే ఆమెదే పైచేయి అవుతుందని కోర్టు ఖర్చులు ఆ పీసీ విలువ కంటే ఎక్కువవుతాయి కాబట్టి ఆ డబ్బును ఒక చేదు జ్ఞాపకంగా భావించి వదిలేయడం మంచిది అని ఓ నెటిజన్ సలహా ఇవ్వగా, డబ్బులు పోయినా పర్లేదు, ఆమె అసలు రంగును స్మాల్ క్లెయిమ్స్ కోర్టులో బయటపెట్టాలని కనీసం కోర్టు చుట్టూ తిరిగేలా చేస్తే ఆమె చేసిన తప్పుకు బుద్ధి వస్తుంది అని మరొకరు కామెంట్ చేశారు. మొత్తంగా ఈ వ్యవహారంలో బాధితులు కోర్టు మెట్లు ఎక్కితే తీర్పు ఎలా ఉండబోతోందో చూడాలి మరి.

Next Story