ఒంటిచేత్తో ఆటో ఎత్తి అమ్మను కాపాడుకున్న చిన్నారి.. వీడియో వైరల్

by karthikeya |
ఒంటిచేత్తో ఆటో ఎత్తి అమ్మను కాపాడుకున్న చిన్నారి.. వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డుపై వెళ్లేటప్పుడు ఎప్పుడు ఎటు నుంచి ప్రమాదం ఎదురవుతుందో తెలీదు. కొన్నిసార్లు ఏ తప్పు చేయకుండానే ప్రమాదాల బారిన పడాల్సి వస్తుంది. ముఖ్యంగా కొంతమంది డ్రైవర్లు రోడ్లపై హైస్పీడ్‌లో వాహనాలు నడుపుతూ అమాయకుల ప్రాణాల మీదికి తీసుకొస్తు్న్నారు. తాజాగా అలాంటి ఘటనే కర్ణాటకలోని మంగళూరులో జరిగింది. కిన్నీగోళి రామనగర్‌లో జరిగినట్లుగా చెబుతున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

వీడియోలో కనిపిస్తున్న దృశ్యాల ప్రకారం.. స్కూల్ నుంచి వచ్చి రోడ్డు అవతల తనకోసం ఎదురు చూస్తున్న కుమార్తె వద్దకు వెళ్లేందుకు ఓ మహిళ రోడ్డు దాటడానికి ప్రయత్నించగా.. అంతలో స్పీడ్‌గా వచ్చిన ఆటో ఆమెను బలంగా ఢీ కొట్టింది. దీంతో ఆమె ఆటో కింద చిక్కుకుపోయింది. ఇది గమనించిన చిన్నారి.. వెంటనే ఆటో దగ్గరకొచ్చి ఆటోను ఒంటిచేత్తో పైకెత్తి తల్లిని కాపాడుకుంది. ఆమెకు ఆటోలో ఉన్న వారు కూడా హెల్ప్ చేయడంతో ఆటో సులభంగా లేపగలిగింది. గాయపడిన మహిళను రాజరత్నాపూర్‌కు చెందిన చేతన (35)గా గుర్తించారు. ఈ ప్రమాదంలో మహిళ తీవ్రంగా గాయపడటంతో స్థానికులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Next Story