ఆకుపచ్చగా దుబాయ్‌ ఆకాశం! తుఫాన్ ముందు వాతావరణం

by Disha Web Desk 14 |
ఆకుపచ్చగా దుబాయ్‌ ఆకాశం! తుఫాన్ ముందు వాతావరణం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎడారి దేశం దుబాయ్ భారీ వర్షాలతో అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. వరదల కారణంగా దుబాయ్‌లోని రోడ్లు, షాపింగ్ మాల్స్, విమనాశ్రయం, రన్‌వేలు అన్నీ నిట మునిగాయి. దీంతో దుబాయ్‌కు భారీ నష్టం సంబవించింది. గత 75 ఏళ్లలో దుబాయ్ చూసిన అత్యంత భారీ వర్షపాతం ఇదే, అక్కడి ప్రభుత్వ నిర్వహణలోని వాతావరణ సంస్థ దీనిని "చారిత్రాత్మక వాతావరణ సంఘటన"గా పేర్కొంది. దీంతో దుబాయ్ వర్షాలు ప్రపంచవ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది. దుబాయ్‌లో వర్షాలు పడుతున్న సమయంలో వాతవరణ మార్పులపై తాజాగా వీడియోలు వైరల్ అవుతున్నాయి.

దుబాయ్‌లో తూఫాన్ వస్తున్న సమయంలో వాతవరణం ఆకుపచ్చగా మారడం వీడియోలో కన్పిస్తుంది. ఈక్రమంలోనే ఆకుపచ్చగా మారిన దుబాయ్‌ ఆకాశమని నెటిజన్లు వీడియోలు పోస్ట్ చేశారు. కాగా, దుబాయ్‌లో ఈ స్థాయిలో వర్షాలు కురవడానికి కారణం క్లౌడ్ సీడింగ్ (కృతిమ వర్షాలు) అని నిపుణులు చెబుతున్నారు. యూఏఈలో ఏటా 200 మిల్లీమీటర్ల కన్నా తక్కువ వర్షపాతం కురుస్తుంది. వేసవి కాలంలో 50 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ఈ నేపథ్యంలో వర్షాల కోసం క్లౌడ్‌ సీడింగ్‌ టెక్నాలజీని ఇక్కడ తరచూ ఉపయోగిస్తారు. తాజాగా కురిసిన వర్షాన్ని గమనించిన పర్యావరణ నిపుణులు ప్రకృతిలో సహజత్వాన్ని మార్చే ప్రయత్నాలు చేస్తే ఈ విధంగా అవుతదని హెచ్చరిస్తున్నారు.

Next Story