బాలిక కడుపులోంచి కిలో బరువున్న వస్తువును తీసిన డాక్టర్స్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే

by Disha Web Desk 7 |
బాలిక కడుపులోంచి కిలో బరువున్న వస్తువును తీసిన డాక్టర్స్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే
X

దిశ, వెబ్‌డెస్క్: చిన్నపిల్లలకు ఏది పడితే అది తినే అలవాటు ఉంటుంది. ఏదైనా చూస్తే వెంటనే నోట్లో పెట్టేసుకుంటారు. కొంత కాలం తర్వాత అనారోగ్యాల పాలవుతుంటారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది. ఓ బాలికకు తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు, బరువు తగ్గిపోవడం లాంటి సమస్యలతో ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ బాలికను పరీక్షించిన వైద్యులు ఆమెకు అరుదైన శస్త్రచికిత్స చేశారు. అనంతరం బాలిక కడుపులో కిలో బరువున్న వస్తువును చూసి ఒక్కసారిగా షాకయ్యారు. వివరాల్లోకి వెళితే..

కృష్ణాజిల్లా గుడివాడ పట్టణానికి చెందిన ఓ బాలిక తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది. అక్కడ బాలికకు స్కానింగ్, ఎండోస్కోపీ నిర్వహించారు. ఈ క్రమంలోనే బాలిక కడుపులో ఏదో నల్లటి వస్తువు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం ఆ బాలికకు శస్త్రచికిత్స నిర్వహించారు. అయితే ఆమె కడుపులో కిలో బరువున్న వెంట్రుకల ముద్దను చూసి షాకయ్యారు. కాగా.. ఆ బాలిక చిన్న వయసు నుంచే వెంట్రుకలు తింటూ ఉండటం వల్ల అవి పేరుకుపోయి జీర్ణాశయం మొత్తం నిండిపోయాయి.

ఈ కారణం చేతనే బాలిక తిన్న ఆహారం కడుపులోకి వెళ్లడం లేదని, వాంతులు అవుతున్నాయని తెలిపారు. అంతేకాకుండా ఆహారం తినలేకపోవడం వల్లనే ఆమె చిక్కిపోయిందని వైద్యులు తెలిపారు. కాగా.. ఇలా వెంట్రుకలు తినడాన్ని ట్రైకోబీజోఆర్ వ్యాధి అని.. ఈ లక్షణం లక్షమందిలో ఒకరికి ఉంటుందని వైద్యులు తెలిపారు. ఇప్పటివరకు ఇలాంటి కేసు చూడలేదని మొదటిసారని వైద్యులు తెలిపారు. కాగా.. చికిత్స తర్వాత బాలిక పూర్తి ఆరోగ్యంగా ఉందని డాక్టర్లు దృవీకరించారు.


Next Story

Most Viewed