పెళ్లి బరాత్‌లో వరుడి ఫ్రెండ్స్ ఏమి చేసారో తెలుసా ?

by Disha Web Desk 10 |
పెళ్లి  బరాత్‌లో  వరుడి ఫ్రెండ్స్ ఏమి చేసారో తెలుసా ?
X

దిశ, వెబ్ డెస్క్ : ఈ మధ్య కాలంలో పెళ్ళిలో జరిగే హంగామా అంతా ఇంతా కాదు..సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన అనేక వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. పెళ్ళికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ నుంచి పెళ్లి వరకు అన్ని వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. వాటిలో ట్రెండ్ అవుతున్నాయి. మరి కొందరైతే పెళ్లి అంటే ఇలాగ చేసుకోవాలని అదే ట్రెండును ఫాలో అవుతున్నారు. పెళ్ళిలో లో బరాత్‌ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. తాజాగా ఒక పెళ్లి వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఆ వీడియోలో యువకులు ఏమి చేసారంటే .

పెళ్లి కొడుకును యడ్ల బండిపై తీసుకొస్తూ స్నేహితులు డ్యాన్సులు వేసి రచ్చ రచ్చ చేసారు. బండి పై వాళ్లు ఎగురుతుంటే పెళ్లి కొడుకు ఎక్కడ పడిపోతాడా అన్నట్టుగా అనిపించింది. ఈ వీడియో చూసిన నెటిజెన్స్ అరేయ్ ఏంట్రా ఇది.. పెళ్లి కొడుకును కింద పడేస్తారు అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోకు 7 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.


Next Story

Most Viewed