బైక్‌పై రైడ్ అనగానే కుక్క ఏం చేసిందో తెలుసా..?(వీడియో)

by Disha Web Desk 4 |
బైక్‌పై రైడ్ అనగానే కుక్క ఏం చేసిందో తెలుసా..?(వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: బైక్‌పై రైడ్ అనగానే చాలామందికి ఫస్ట్ గుర్తొచ్చేది హెల్మెట్. సేఫ్టీ కన్నా ట్రాఫిక్ వాళ్లు ఎక్కడా చలాన్లు వేస్తారో అనే భయానికి చాలా మంది హెల్మెట్లు వాడుతున్నారు. అయితే ఓ కుక్క బైక్‌పై రైడ్ అనగానే ఫుల్ జోష్‌తో హెల్మెట్ తీసుకుని యజమాని వద్దకు వచ్చేసింది. సడెన్‌గా హెల్మెట్ కింద పడటంతో నోటితో ఆ హెల్మెట్‌ను తనను పెంచుకుంటున్న వ్యక్తికి ఇచ్చింది. అనంతరం బైక్‌పై తాను జంప్ చేసి మరి ఎక్కేసింది. అనంతరం కుక్కకు వ్యక్తి హెల్మెట్ తొడిగాడు. ఇక అలా తిరిగొద్దమని కుక్క, బైకర్ రెడీ అయిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 6.6 మిలియన్ల మంది ట్విట్టర్లో ఈ వీడియోను చూశారు. వీడియో చూసిన నెటిజన్లు ‘స్టార్ట్ డాగ్’, ‘వావ్ క్యూట్’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.


Next Story

Most Viewed