మీ ఫోన్ నెంబర్లు ఎక్కడ పడితే అక్కడ ఇచ్చేస్తున్నారా..? అయితే ఈ వార్త కచ్చితంగా చదవాల్సిందే..!

by Disha Web Desk 7 |
మీ ఫోన్ నెంబర్లు ఎక్కడ పడితే అక్కడ ఇచ్చేస్తున్నారా..? అయితే ఈ వార్త కచ్చితంగా చదవాల్సిందే..!
X

దిశ, వెబ్‌డెస్క్: మనం చాలా సార్లు గమనించే ఉంటాం. సూపర్ మార్కెట్స్‌కు, షాపింగ్ మాల్స్‌కు వెళ్లినప్పుడు వారు మన ఫోన్ నెంబర్లు తీసుకుంటారు. ఇలా ఎక్కడికి వెళ్లినా బిల్ కౌంటర్ వద్ద ఫోన్ నెంబర్ అడుగుతారు. మనం కూడా ఎందుకు అని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఫోన్ నెంబర్ ఇచ్చేస్తాం. ఇలా మాల్స్, సూపర్ మార్కెట్స్ అని కాదు.. లక్కీ డ్రాల పేరుతో కూడా ఫోన్ నెంబర్లు సేకరిస్తుంటారు. ఇలా అడిగినా ప్రతీ చోటా ఏమాత్రం ఆలోచించకుండా ఫోన్ నెంబర్లు, వ్యక్తి వివరాలు ఇచ్చేస్తుంటారు. అది ఎంత ప్రమాదమో ఎప్పుడైనా ఆలోచించారా..? అవి ఎన్ని రకాల మోసాలకు దారి తీస్తున్నాయో తెలుసా..? మనం ఇచ్చే ఏ ఒక్క ఇన్‌ఫర్‌మేషన్ అయిన హ్యాకర్ల చేతిలో పడితే అంతే సంగతి. అయితే మీకు తెలియని ఇంకో విషయం ఏంటంటే..?

అలా కస్టమర్ల నుంచి ఫోన్ నెంబర్లు సేకరించకూడదని వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు. ఫోన్ నెంబర్, ఇతర వ్యక్తిగత వివరాలు ఇచ్చే వరకు బిల్ ప్రాసెస్ పూర్తి చేయలేమని చెబుతుంటారు. అయితే ఈ వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం.. ఫోన్ నెంబర్లు, వ్యక్తిగత వివారాలు తీసుకోవడం అనేది అన్యాయమైన, నిర్బంధ వాణిజ్య పద్ధతి కిందకు వస్తుందని ఆయన తెలిపారు. ఫోన్ నెంబర్లు, ఇతర సమాచారాన్ని సేకరించడం వెనుక వాళ్లకు కానీ, వినియోగదారులకు గానీ ఎలాంటి ప్రయోజనం కలిగించే అంశం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు మీరు ఈ సారి షాపింగ్‌కు వెళ్లినప్పుడు అక్కడ మీ మొబైల్ నెంబర్ అడిగితే.. ఇవ్వమని చెప్పండి. తప్పనిసరిగా ఫోన్ నెంబర్లు ఇవ్వాలని.. లేదంటే బిల్ చేయడం కుదరదని వాదిస్తే ఈ రూల్ గురించి చెప్పి మీ నెంబర్ మిస్ యూజ్ కాకుండా చూసుకోండని రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు.

Read More... PUBG ప్రేమికులకు గుడ్ న్యూస్..



Next Story

Most Viewed