వైరల్ డాన్స్ వీడియో కారణంగా దంపతులకు 10 ఏళ్ల జైలు శిక్ష

by Disha Web Desk 12 |
వైరల్ డాన్స్ వీడియో కారణంగా దంపతులకు 10 ఏళ్ల జైలు శిక్ష
X

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియాలో డ్యాన్స్ వీడియో వైరల్ కావడంతో 20 ఏళ్లు ఉన్న దంపతులకు 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఈ విచిత్రమైన సంఘటన ఇరాన్‌లో చోటు చేసుకుంది. టెహ్రాన్‌లోని ఆజాదీ టవర్ ముందు డ్యాన్స్ చేసిన ఓ జంటకు ఇరాన్ కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

ఆ వీడియోలో దంపతులు వేసిన డాన్స్ ఇరాన్ ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా కనిపించిందని కోర్టు భావించింది. అస్తియాజ్ హఘిఘీ, ఆమె కాబోయే భర్త అమీర్ మొహమ్మద్ అహ్మద్ అరెస్టు చేశారు. కాగా సదరు వీడియోలో హాఘీ స్కార్ఫ్ లేకుండా కనిపించడం కూడా వారికి జైలు శిక్ష పడటానికి ఓ కారణం.


Next Story