నవ్వుల కోసమా? బూతుల కోసమా.. వివాదాస్పదంగా మరో స్టాండప్ కామెడియన్ వీడియో

by Ajay Maddhiboyina |

స్టాండ‌ప్ కామెడీ అంటేనే బూతు కామెడీలా మారిపోతోంది. అయితే.. ఇత‌రుల ప‌ర్స‌న‌ల్ లైఫ్ పై జోకులు వేసి అదే కామెడీ అనుకోవ‌డం.. లేదంటూ బూతులు మాట్లాడుతూ దాన్నే కామెడీ అనుకుంటున్నారు. ఒక‌ప్పుడు కేవ‌లం నార్త్ లోనే స్టాండ‌ప్ కామెడీకి క్రేజ్ ఎక్కువ‌గా ఉండ‌గా ఇప్పుడు తెలుగులోనూ కొంత క్రేజ్ వ‌చ్చింది.

నవ్వుల కోసమా? బూతుల కోసమా.. వివాదాస్పదంగా మరో స్టాండప్ కామెడియన్ వీడియో
X

దిశ‌, వెబ్ డెస్క్: స్టాండ‌ప్ కామెడీ అంటేనే బూతు కామెడీలా మారిపోతోంది. అయితే.. ఇత‌రుల ప‌ర్స‌న‌ల్ లైఫ్ పై జోకులు వేసి అదే కామెడీ అనుకోవ‌డం.. లేదంటూ బూతులు మాట్లాడుతూ దాన్నే కామెడీ అనుకుంటున్నారు. ఒక‌ప్పుడు కేవ‌లం నార్త్ లోనే స్టాండ‌ప్ కామెడీకి క్రేజ్ ఎక్కువ‌గా ఉండ‌గా ఇప్పుడు తెలుగులోనూ కొంత క్రేజ్ వ‌చ్చింది. దీంతో హైద‌రాబాద్ లోనూ స్టాండ‌ప్ కామెడీ షోలు నిర్వ‌హిస్తున్నారు. అయితే ఇందులో చేసే కామెడీ కంటే వివాదాలే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం జ‌న‌సేన అధినేత‌, ఏపి డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ పై ఓ స్టాండ‌ప్ క‌మెడియ‌న్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశాడు. ప‌వ‌న్ తో పాటు నిహారిక‌పై కూడా అత‌డు అలాంటి కామెంట్సే చేశాడు. అత‌డిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు అరెస్ట్ కూడా చేశారు.

ఇక ఇప్పుడు ఓ లేడీ స్టాండ‌ప్ క‌మిడియ‌న్ బూతులు మాట్లాడుతూ ప్రేక్ష‌కుల‌ను న‌వ్వించే ప్ర‌య‌త్నం చేసింది. ఒకరిని ప్రేమించడం పెళ్లితో సమానం అయితే.. చాలా మందిని ప్రేమిస్తే ల** అని అంటార‌ని చెప్పింది. అలా అనుకుంటే తాను ల** నే అని దానికి చాలా గొప్ప‌గా ఫీల్ అవుతున్నాన‌ని తెలిపింది. ఎవ‌రు ఏం అనుకున్నా త‌న‌కు స‌మ‌స్య లేద‌ని చెప్పింది. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. దీంతో నెటిజ‌న్లు స్టాండ‌ప్ క‌మెడియ‌న్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. దీన్ని ఎవ‌రైనా కామెడీ అంటారా అని మండిప‌డుతున్నారు. ఈ షోలు న‌వ్వుల కోస‌మా? బూతుల కోస‌మా అని ప్ర‌శ్నిస్తున్నారు. ప్ర‌భుత్వం ఇలాంటి కామెడీ షోల‌ను బ్యాన్ చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

Next Story