కలను నెరవేర్చుకోవడానికి కంటి చూపు పోగొట్టుకున్న యువతి.. ఆమె రీజన్‌ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

by sudharani |
కలను నెరవేర్చుకోవడానికి కంటి చూపు పోగొట్టుకున్న యువతి.. ఆమె రీజన్‌ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతీ ఒక్కరికి తమ జీవితంలో ఏదో సాధించాలని కోరిక ఉంటుంది. ఏం చేశాయిన కోరిన కలను నెరవేర్చుకోవాలని చాలా మంది ప్రయత్నిస్తారు. ఈ క్రమంలోనే ఓ యువతి తనకున్న వింత కోరికను నెరవేర్చుకునేందుకు ఏకంగా అంధురాలిగా మారింది. అయితే ఆమెకు ఉన్న ఆ వింత కోరిక ఏంటి అనేది తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోవాల్సిందే. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే...

అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాకు చెందిన ఓ మహిళ తనకు 21 ఏళ్లు ఉన్నప్పుడు.. తనను తాను అంధురాలిగా మారాలని నిర్ణయం తీసుకుంది. ఎవరైనా తమ కంటి చూపు, లేదా శరీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. తను మాత్రం కంటి చూపు కోల్పోవాలని కోరుకుందట. ఇదే విషయంపై షుపింగ్ ఓ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నాకు చిన్నప్పటి నుంచి అంధురాలిగా ఉండాలని కల ఉండేది. అందుకోసం నా కళ్లకు డ్రైన్ క్లీనర్ అప్లై చేశాను. దీంతో నా కంటి చూపు పూర్తిగా కోల్పోయాను. నా కంటి చూపు నేను కోల్పోయినప్పుడు నాకు చాలా సంతోషమనిపించింది. అంతే కాకుండా చిన్న తనం నుంచి నా కోరిక నెరవేరింది’’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా.. షుపింగ్ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇలాంటి కలలు కూడా ఉంటాయా అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

Next Story

Most Viewed