తలపై అక్వేరియం తయారు చేపించుకున్న మహిళ.. చేపలు ఎలా ఈత కొడుతున్నాయో చూడండి!(వీడియో)

by Anjali |   ( Updated:2024-02-26 11:44:36.0  )
తలపై అక్వేరియం తయారు చేపించుకున్న మహిళ.. చేపలు ఎలా ఈత కొడుతున్నాయో చూడండి!(వీడియో)
X

దిశ, ఫీచర్స్: ప్రస్తుత రోజుల్లో టెక్నాలజీ ఎంత స్పీడ్‌గా దూసుకుపోతుందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. మనిషి సృజనాత్మకంగా ఆలోచిస్తూ.. సోషల్ మీడియాలోని జనాలను ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇకపోతే తాజాగా ఓ మహిళ హెయిర్ స్టైల్ నెట్టింట వైరల్ గా మారింది. కొంతమంది తమ జుట్టును అనేక రకాలుగా హెయిర్ స్టైల్ చేయించుకుంటారు. నలుగురిలో భిన్నంగా కనిపించేందుకు ప్రయత్నిస్తుంటారు.

కొత్త కొత్త హెయిర్ స్టైల్స్ తో నెట్టింట జనాలందరినీ ఆశ్యర్యపరుస్తుంటారు. తాజాగా ఓ మహిళ ఇప్పటి వరకు ఎవ్వరూ చేయించుకొని హెయిర్ స్టైల్‌తో నివ్వెరపరుస్తుంది. aheadhairmedi అనే ఇన్‌స్టాగ్రామ్ నుంచి షేర్ చేసిన వీడియో ప్రకారం చూసినట్లైతే.. ఓ మహిళ సెలూన్ ‌లో కూర్చుని ఉంది. అక్కడున్న రకరకాల జెల్లీలు తన హెయిర్‌ను పూసి.. పాత్ర ఆకారంలోకి మార్చారు.

అనంతరం తన తలపై ఏర్పాటు చేసిన అక్వేరియంలో వాటర్ పోశాడు. నీటితో పాటు చిన్న చిన్న ఫిష్ పిల్లలను కూడా అందులో వేశాడు. ఆ యువతి తలపైనున్న అక్వేరియంలో చేపలు ఈత కోడుతోన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఏకంగా ఆమె తలపై హెయిర్ సహాయంతో అక్వేరియం ఏర్పాటు చేసుకున్న మహిళగా రికార్డు సృష్టించింది. అని కొంతమంది కామెంట్లు చేయగా..

మరికొంతమంది ఈ అక్వేరియంతో ఆమె ఎలా నిద్రపోతుంది, కేవలం లైక్స్ కోసమే ఈ హెయిర్ స్టైల్ చేయించుకున్నట్లుంది. మీ హెయిర్ స్టైల్ నాకు నచ్చలేదు మేడమ్.. దీని కంటే నా హెయిర్ స్టైల్ బెటర్. అంటూ జనాలు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Advertisement

Next Story