పిల్లికి గిన్నీస్ రికార్డ్ .. వామ్మో మరీ అంత ఎత్తా?(వీడియో)

by Disha Web |
పిల్లికి గిన్నీస్ రికార్డ్ .. వామ్మో మరీ అంత ఎత్తా?(వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్ : సాధారణంగా మూగజీవాలైన పిల్లులు చిన్న పరిమాణం కలిగి ఉంటాయని అందరికీ తెలుసు. అయితే ఇవి చిన్నగా ఉండటం వల్లనే కొందరు వీటిని అల్లారు ముద్దుగా పెంచుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఎనలేని ప్రేమను చూపించి.. సమయమంతా వాటితోనే గడుపుతున్నారు. అయితే ఈ పిల్లుల జాతుల్లో కొన్ని తక్కువ ఎత్తు చిన్న పరిమాణంతో ఉంటే.. మరికొన్ని పిల్లులు భారీ ఎత్తుతో పెద్దగా ఉంటాయి. ఇక అలాంటి పిల్లులను చూసినపుడు ఆశ్చర్యకరంగా ఉంటుంది. అయితే తాజాగా అలాంటిదే ఒక పిల్లిజాతి నుంచి కనిపించిన జీవి ఎత్తైన పరిమాణంతో ఏకంగా గిన్నీస్ రికార్డ్ నెలకొల్పి అందరి దృష్టిని ఆకట్టుకుంది.

సవన్నా జాతికి చెందిన ఈ పెంపుడు పిల్లి సుమారు 18.83 అంగుళాల పొడువుతో గిన్నీస్ రికార్డు సాధించింది. ఇక ఈ ఘనతపై యజమాని డాక్టర్ విలియం జాన్ పవర్స్ మాట్లాడారు. ఈ సవన్నా జాతి పిల్లులు.. పెంపుడు పిల్లికి ఒక ఆఫ్రికన్ పిల్లికి పుట్టిన సంకర జాతి. అయితే ఈ జాతి పిల్లులు చరిత్రలో అత్యంత ఎత్తైన పెంపుడు పిల్లులుగా ఉన్నాయని పేర్కొన్నారు. కాగా, ఈ పిల్లి జాతి మొత్తం ఒక అగ్ని ప్రమాదంలో మరణించినట్లు తెలిపారు. ఇక 2016లో పెన్నిర్‌కి చెందిన మరోజాతి పిల్లి దాదాపు 19.05 అడుగుల ఎత్తుతో రికార్డు సృష్టించిందని పేర్కొన్నాడు.

Next Story

Most Viewed