గ‌ణ‌ప‌తి నిమజ్జనంలో అపశృతి.. 25 ఏళ్ల యువకుడు మృతి

by  |
suresh
X

దిశ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బండారుపాడు గ్రామ గణపతి నిమజ్జనోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. గ్రామంలో ప్రతిష్టించిన వినాయకుని నిమజ్జన శోభాయాత్రను మంగళవారం గ్రామస్తులందరూ కలిసి ఘనంగా నిర్వహించారు. శోభయాత్ర ముగించుకొని నిమజ్జనం చేసే క్రమంలో లడ్డూ వేలం పాట ప్రారంభించారు. నిర్వాహకుడు సురేష్(25) అనే యువకుడు ట్రాక్టర్ పైకి ఎక్కి మైక్‌లో మాట్లాడుతుండగా విద్యుత్ వైర్లు తగిలి షాక్‌‌కు గురయ్యాడు. దీంతో సురేష్ ట్రాక్టర్ మీదనుంచి కిందపడిపోయాడు. ఈ క్రమంలో తలకు బలమైన గాయమైంది. వెంటేనే స్థానిక కొత్తగూడెం ఆసుపత్రికి తరలిస్తుండగా పరిస్థితి విషమించి మార్గంమధ్యలో సురేష్ మృతిచెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చండ్రుగొండ ఎస్ఐ రాజేష్‌ కుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సురేష్ మృతి పట్ల ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సంతాపం తెలియజేశారు.

Next Story

Most Viewed