మహారాష్ట్రకు రాకపోకలు బంద్

by  |
మహారాష్ట్రకు రాకపోకలు బంద్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా సెకండ్ వేవ్ కోరలు చాచుతున్న క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమ్యాయి. మళ్లీ కరోనా నిబంధనలు, ఆంక్షలను కఠినతరం చేస్తున్నాయి. పలు రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూ, వీకెండ్ లాక్‌డౌన్ విధిస్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూ విధించగా.. మరికొన్ని రాష్ట్రాలు ఆంక్షల దిశగా అడుగులేస్తున్నాయి.

అందులో భాగంగా రాష్ట్రంలో కరోనా తీవ్రతరం అవుతున్న క్రమంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. మాస్కులు పెట్టుకోని వారికి రూ.వెయ్యి జరిమానా విధించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. తాజాగా కరోనా కట్టడి కోసం అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న మహారాష్ట్రకు రాకపోకలు నిలిపివేశారు. రెంజల్ మండలం కందకుర్తి చెక్ పోస్ట్ వద్ద మహారాష్ట్ర నుంచి రాకపోకలు నిషేధిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు చెక్ పోస్టు వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు.

Next Story