అలర్ట్.. హైదరాబాద్ చుట్టూ ట్రాఫిక్ మళ్లింపు

by  |
అలర్ట్.. హైదరాబాద్ చుట్టూ ట్రాఫిక్ మళ్లింపు
X

దిశ, డైనమిక్ బ్యూరో : ‘గులాబ్’ తుఫాన్ కారణంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రం తడిసి ముద్దైయ్యింది. తుఫాన్ ప్రభావం హైదరాబాద్ మహానగరంపై తీవ్రంగా ఉండటంతో ఎక్కడికక్కడ వరద నీరు నిలిచిపోయి రోడ్లు.. చెరువులను తలపిస్తున్నాయి. వదర నీరు కారణంగా నగర శివారుల్లోని చెరువులు నిండిపోయి.. నీళ్లు రోడ్లపైకి వచ్చి ప్రమాదకరంగా మారాయి. వాహనదారులు నీటి లోతును అంచనా వేయకుండా వస్తే ప్రమాదం జరుగుతుందనే కారణంగా పోలీసులు అప్రమత్తమయ్యారు.

వాహనాల రాకపోకలను నిలిపివేసి ట్రాఫిక్‌ని మళ్లిస్తున్నారు. వరద నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న రోడ్డు మార్గాల్లో ట్రాఫిక్‌ను దారి మళ్లిస్తున్నారు. మంగళవారం సైబరాబాద్ పోలీసులు తెలిపిన ప్రకారం.. ‘‘ గగన్‌పహాడ్ వద్ద అప్పా చెరువు పూర్తిగా నిండింది.

అందువల్ల NH-44 ద్వారా.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్.. కర్నూల్, బెంగళూర్ వెళ్లే వాహనదారులు ORR మీదుగా వెళ్లాలి.. అంతేకాకుండా.. హిమయత్ సాగర్ చెరువు ప్రమాదకరంగా ఉంది.. TSPA నుంచి శంషాబాద్‌కి వచ్చే వారు ORR మీదుగా కాకుండా.. ఖలీజ్‌ఖాన్ దర్గా- కిస్మత్‌పుర, బద్వేల్ ఎక్స్‌టెన్షన్, పిల్లర్ నెంబర్ 194- ఆరాంఘర్ మీదుగా వెళ్లాలని’’ తెలిపారు. అటుగా వెళ్లే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ మళ్లింపు విషయాన్ని తెలుసుకుంటే.. ఎలాంటి ఇబ్బంది ఉండదని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.


Next Story

Most Viewed